బోయిన్‌పల్లి కిడ్నాప్‌ ‘స్పెషల్‌’!

ABN , First Publish Date - 2021-01-14T07:46:37+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ ఉదంతం అత్యంత నాటకీయంగా జరిగింది. ఏ మాత్రం అనుమానం రాకుండా ఆ నాటకీయతను రక్తి కట్టించేందుకు ఓ హిందీ సినిమాను అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌, చంద్రహాస్‌, ఇతర అనుచరులు స్ఫూర్తిగా తీసుకున్నారా? పోలీసుల విచారణలో ఇదే వెల్లడైంది. 2013లో విడుదలైన అక్షయ్‌ కుమార్‌

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ ‘స్పెషల్‌’!

  • అక్షయ్‌ సినిమా స్ఫూర్తితోనే ముగ్గురి కిడ్నాప్‌..
  • సినిమాటిక్‌ స్కెచ్‌ అఖిలప్రియదే! 
  • ‘ఐటీ’ గ్యాంగ్‌కు వారం పాటు శిక్షణ 
  • సినిమా కంపెనీ నుంచి అద్దెకు డ్రెస్సులు
  • చిక్కినట్లే చిక్కి పరారైన గుంటూరు శ్రీను! 

హైదరాబాద్‌ సిటీ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): బోయిన్‌పల్లి కిడ్నాప్‌ ఉదంతం అత్యంత నాటకీయంగా జరిగింది. ఏ మాత్రం అనుమానం రాకుండా ఆ నాటకీయతను రక్తి కట్టించేందుకు ఓ హిందీ సినిమాను అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌, చంద్రహాస్‌, ఇతర అనుచరులు స్ఫూర్తిగా తీసుకున్నారా? పోలీసుల విచారణలో ఇదే వెల్లడైంది. 2013లో విడుదలైన అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘స్పెషల్‌-26’ సినిమాను చూసిన తర్వాతనే నిందితులు ఐటీ అధికారుల పాత్ర పోషించినట్లు గుర్తించారు. కిడ్నా్‌పనకు ముందు ఆ సినిమా గురించి చంద్రహా్‌సతో అఖిలప్రియ చెప్పినట్లు, ఆమె ఆదేశాలతోనే అక్షయ్‌కుమార్‌ సినిమాను కిడ్నాప్‌ గ్యాంగ్‌కు భార్గవ్‌రామ్‌, చంద్రహాస్‌ చూపించినట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులుగా ఎలా నటించాలనే దానిపై వారం పాటు గ్యాంగ్‌కు శిక్షణ ఇచ్చినట్లూ సమాచారం. సినిమా ఆధారంగా యూసు్‌ఫగూడ ఎంజీఎం స్కూల్‌లో కిడ్నా్‌పకు స్కెచ్‌ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఐటి అధికారుల చెకింగ్‌ డ్రెస్సులు, ఐడీ కార్డులను చంద్రహాస్‌ తయారు చేశారని, శ్రీ నగర్‌ కాలనీలోని ఒక సినిమా కంపెనీ నుంచి ఐటీ అధికారుల డ్రెస్‌లను వీరు అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది.


కాగా ప్రవీణ్‌, నవీన్‌, సునీల్‌ల కిడ్నాప్‌ కేసుకు సంబంధించి కస్టడీలో ఉన్న అఖిలప్రియను పోలీసులు మూడోరోజూ విచారించారు. కస్టడీలో ఆమె చెప్పే సమాధానాల ఆధారంగా ఇతర నిందితుల ఆచూకీ గుర్తించడంతో పాటు ఆధారాల సేకరణకు పోలీసులు ప్రాధాన్యమిస్తున్నారు. న్యాయవాదుల సమక్షంలో జరిగిన విచారణలో భాగంగా రోజుకు 100 ప్రశ్నల చొప్పున మొత్తం 300 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఆమెను విచారించిన వారిలో మహిళా అధికారులే ఉన్నట్లు సమాచారం. చాలా ప్రశ్నలకు ఆమె మౌనంగానే ఉన్నారని, కొన్నింటికి మాత్రం ఆమె సమాధానమిచ్చినట్లు తెలిసింది. బాధితులను కిడ్నాప్‌ చేసిన తర్వాత భార్గవ్‌రామ్‌ తన సొంత ఫామ్‌హౌజ్‌లో బాధితుల నుంచి ల్యాండ్‌కు సంబంఽధించిన పత్రాలపై సంతకాలు తీసుకున్నట్లు వచ్చిన వార్తల ఆధారంగా సమాచారం సేకరించారు. కిడ్నా్‌పలో పాల్గొన్న అందరి పాత్ర గురించి ఆమెను ప్రశ్నించారు. భార్గవరామ్‌ సహా.. ఇతర నిందితులు ఎక్కడున్నారనే కోణంపై ఆమెను విచారించారు. గురువారం మధ్యాహ్నం ఆమెకు తిరిగి జైలుకు తీసుకెళ్తామని సీపీ చెప్పారు. 


సీసీ ఫుటేజీ కీలకం

యూస్‌ఫగూడలోని ఎంజీఎం స్కూల్‌లో కిడ్నా్‌పకు పథకం రచించారని.. అక్కడే డ్రస్‌లు మార్చుకొని, వాహనాల నంబర్‌ప్లేట్లు మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే అఖిలప్రియ నివాసముంటున్న కూకట్‌పల్లి లోథా అపార్టుమెంట్‌ నుంచి యూసు్‌ఫగూడ ఎంజీఎం స్కూల్‌.. అక్కడి నుంచి బోయిన్‌పల్లిలో బాధితుల నివాసం, కిడ్నాప్‌ అనంతరం మోయినాబాద్‌ వరకు సీసీ ఫుటేజీలను పరిశీలించిన అధికారులు దానికి సంబంధించిన మ్యాప్‌ కూడా సిద్ధం చేసుకున్నారు. సీసీ ఫుటేజీతో పాటు మ్యాప్‌ ఈ వ్యవహారంలో కీలక ఆధారంగా మారనుందని ఓ అధికారి వివరించారు. కిడ్నాప్‌ సమయంలో ప్రవీణ్‌ రావు నివాసం దగ్గర భార్గవ్‌రామ్‌ కూడా రెక్కీలో పాల్గొన్నట్లు విచారణలో నిర్ధారించారు. 


కూకట్‌పల్లిలోని ఓ లాడ్జిలో కిడ్నాపర్ల కోసం భార్గవ్‌ బస ఏర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. కిడ్నాప్‌ చేసిన నవీన్‌, సునీల్‌, ప్రవీణ్‌లను చిలుకూరు దగ్గరలోని ఫామ్‌హౌ్‌సలో నిందితులు బంధించారు. నవీన్‌, సునీల్‌తో డాక్యుమెంట్లపై భార్గవ్‌ సంతకాలు పెట్టించుకున్నారని ప్రచారం జరిగింది. డాక్యుమెంట్లపై ఆళ్లగడ్డ అని ఉండటంతో ప్రవీణ్‌ రావు సంతకం చేసేందుకు నిరాకరించారు. అంతలోనే కిడ్నాప్‌ వ్యవహారం పోలీసులకు తెలిసిందంటూ అఖిలప్రియ భార్గవ్‌కు ఫోన్‌ చేసి చెప్పారని పోలీసులు గుర్తించారు. అలా అఖిల ప్రియ ఫోన్‌ కాల్‌ చేయడంతో అలర్ట్‌ అయిన కిడ్నాపర్లు.. ముగ్గురినీ మొయినాబాద్‌లో వదిలేసినట్లు తెలిసిందే. కాగా కిడ్నాప్‌ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన గుంటూరు శ్రీను పుణెలో చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. పుణెలోని ఓ హోటల్‌లో బస చేశాడనే సమాచారం రావడంతో అక్కడికి నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వెళ్లగా.. ఓ గంట ముందే అక్కడి నుంచి శ్రీను పరారైనట్లు తెలిసింది.

Updated Date - 2021-01-14T07:46:37+05:30 IST