Abn logo
Aug 15 2020 @ 17:14PM

సుశాంత్ కేసుకు సీబీఐ సరైన ముగింపునివ్వాలి: అనుపమ్ ఖేర్

ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక కోణాల్లో విచారణ జరుపుతోంది. ఈ నేపథ్యంలో సుశాంత్‌కు న్యాయం జరగాలని అతడి అభిమానులు, ఇతర నటీనటులు కోరుతున్నారు. వీరిలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వంటి సీనియర్లు కూడా ఉన్నారు. సుశాంత్‌ కేసులో దోషులకు శిక్ష పడాలని వారంతా కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ ఓ ట్వీట్ చేశారు. ‘సహ నటుడిగా, సినీ పరిశ్రమలో ఓ సభ్యుడిగా సుశాంత్‌కు, అతడి కుటుంబానికి న్యాయం జరగాలని ఆశిస్తున్నాను. ఓ గొప్ప నటుడు అన్యాయంగా మరణించడం కలచివేస్తోంది. ఈ కేసులో దోషులను సీబీఐ కచ్చితంగా పట్టుకోవాలి. కేసుకు సరైన ముగింపునివ్వాలి. అది మాత్రమే సుశాంత్ కుటుంబానికి స్వాంతన కలిగిస్తుంద’ని అనుపమ్ ఖేర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement