కలవడానికి ఇంటికి వచ్చే ఫ్యాన్స్ గురించి అభిషేక్‌తో అమితాబ్ ఏమన్నాడంటే..

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడిగా ఇండస్ర్టీకి పరిచయమై తనకంటూ ఓ గుర్తింపు పొందిన నటుడు అభిషేక్ బచ్చన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘బాబ్ బిశ్వాస్’. ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ పామ్ ‘జీ5’లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడీ ‘ధూమ్’ స్టార్.


అభిషేక్, అమితాబ్ గురించి మాట్లాడుతూ.. ‘ఆయన ఓ సాధారణ ప్రాంతం నుంచి వచ్చి ఈ స్థాయిలో అభిమానగణాన్ని సాధించుకున్నారు. కోల్‌కతాలో మంచి జీతం ఉన్న ఉద్యోగం వదిలేసి, ముంబైకి వచ్చి, మెరైన్ డ్రైవ్‌లో రాత్రులు పడుకుని, సినిమా ఆడిషన్స్‌లో పాల్గొని.. ఆల్ ఇండియా రేడియోకి వెళ్లి, వాయిస్ టెస్ట్ రిజెక్ట్ అయిన వ్యక్తి నాకు ఓ గుర్తింపునిచ్చాడు. దాదాపు 80 సంవత్సరాల వయస్సులో అప్పులను తీర్చడానికి కష్టపడ్డాడు. ప్రతి రోజు 16-18 గంటలు పని చేసేవాడు. ఆ ఏజ్ ఇది అంతా సులభం కాదు. అందుకే ఎంత ఎదిగిన వినయంగా ఉండాలని ఎప్పుడూ ఆయన చెబుతూ ఉంటాడ’ని చెప్పాడు.


అంతేకాకుండా.. ‘1982లో విడుదలైన కూలీ సినిమా షూటింగ్ సమయంలో ఆయన గాయపడ్డారు. అందుకే ప్రతి రోజు ఎంతో మంది అభిమానులు ఆయన్ని చూడటానికి వచ్చేవారు. ఎంత బాధలో ఉన్నప్పటికీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు తన శక్తి మేరకు అన్ని విధాలుగా ప్రయత్నం చేసేవారు. నేను నటుడిగా మారక ఆయన నన్ను వాళ్లకి పరిచయం చేయగా.. నేను ఊపిన నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే వారు అమితాబ్ బచ్చన్ కోసం వచ్చార’ని తెలిపాడు.


అంతేకాకుండా.. ‘ఎంత ఇబ్బంది పడ్డా మీరు ఫ్యాన్స్ కలుస్తున్నారు కదా. మళ్లీ మిమ్మల్ని చూడడానికి వస్తారని అనుకుంటున్నారా అని అడిగా.. దానికి ఆయన వాళ్లు తిరిగి వచ్చేలా చేసేందుకు ఎక్కువ కష్టపడాలని చెప్పాడు. ఆయనలాంటి పెద్ద స్టార్ అలా అనడం నాకు ఆశ్చర్యమనిపించింది.

Advertisement

Bollywoodమరిన్ని...