Abn logo
Aug 12 2020 @ 10:24AM

చ‌ర‌ణ్ విల‌న్‌తో బాలకృష్ణ‌..?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ తొలి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత త‌దుప‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌కు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో ఓ బాలీవుడ్ విల‌న్‌ను న‌టింప చేస్తార‌ని చాలా రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు వివేక్ ఒబెరాయ్‌ను విల‌న్‌గా న‌టింప చేస్తార‌ని టాక్‌. మ‌రి ఈ వార్త‌ల‌పై వివేక్ సోష‌ల్ ద్వారా ఏమైనా స‌మాధానమిస్తారేమో చూడాలి. రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ‘విన‌య‌విధేయ‌రామ‌’ చిత్రంలో వివేక్ ఒబెరాయ్ విల‌న్‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. సాధార‌ణంగా విల‌న్ క్యారెక్ట‌ర్‌ను ప‌వ‌ర్‌ఫుల్‌గా డిజైన్ చేసే ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన బోయ‌పాటి ఈసారి వివేక్ ఒబెరాయ్‌ను ఎలా చూపిస్తారో మ‌రి. బాల‌కృష్ణ 106వ చిత్రంగా తెర‌కెక్కుతోన్న ఇందులో బాల‌య్య రెండు పాత్ర‌లు పోషిస్తున్నారు. అందులో ఓ పాత్ర అఘోరా పాత్ర. సింహా, లెజెండ్ చిత్రాల త‌ర్వాత బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement