Abn logo
Jun 6 2020 @ 21:33PM

మహేష్ సరసన ఆ నటుడి కూతురు.. నిజమేనా?

చాలా గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ వివరాలను ప్రకటించారు. ‘గీతగోవిందం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ఆయన చేయబోతున్న సినిమాకు సంబంధించి టైటిల్, ప్రీలుక్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్‌తో తెరకెక్కబోతోన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన నటించే హీరోయిన్ ఎవరనే దానిపై రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మొన్నటి వరకు ‘భరత్ అనే నేను’ ఫేమ్ కియారా అద్వానీ దాదాపు ఫిక్స్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పడు హీరోయిన్‌గా మరో బాలీవుడ్ భామ పేరు వినిపిస్తుంది.


ఇంతకీ ఆ భామ ఎవరనుకుంటున్నారా? బాలీవుడ్ నటుడు, దర్శకుడు అయిన మహేష్ మంజ్రేకర్ కూతురు సాయి మంజ్రేకర్‌ అని అంటున్నారు. ఈ భామ ఇటీవల వచ్చిన సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ చిత్రంలో నటించింది. ఇప్పుడీ భామ మహేష్ బాబు సరసన నటించబోతుందంటూ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ఆమెను సంప్రదించారని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. అయితే చిత్రయూనిట్ నుంచి మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం రాలేదు. 

Advertisement
Advertisement
Advertisement