Oct 23 2021 @ 16:29PM

అనన్య పాండే‌‌ను బిగ్గెస్ట్ ఫూల్ అంటున్న సినీ క్రిటిక్.. త్వరలో జాన్వీకపూర్ కజిన్ ఎన్సీబీ ముందుకు

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో దాదాపుగా 20మందికి పైగా అరెస్టు అయ్యారు. డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతోంది. దీంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)అధికారులు బాలీవుడ్ యువనటి అనన్య పాండే ఇంటిలో సోదాలు జరపడంతో పాటు, కింగ్ ఖాన్ నివాసమైన మన్నత్ పైన దాడులు జరిపారు. 


ఆర్యన్ బెయిల్ పిటిషన్‌కు దరఖాస్తు చేసుకోగా కోర్టు దానిని తోసిపుచ్చింది. అనంతరం అతడికి జ్యూడిషియల్ కస్టడీని అక్టోబర్ 30వరకు విధించింది.  డ్రగ్స్ కేసులో లింకులపై ఎన్సీబీ అధికారులు అనన్య పాండేను ప్రశ్నిస్తున్నారు. షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌కు అనన్య పాండే బెస్ట్ ప్రెండ్ అని బాలీవుడ్‌లో అందరికీ తెలిసిన విషయమే. 


బాలీవుడ్ సినీ విమర్శకుడైన కమల్ ఆర్.ఖాన్ బిగ్గెస్ట్ ఫూల్‌గా అనన్య‌ను అభివర్ణించాడు. ఆర్యన్ అరెస్టు అయి 20రోజులు అయిన అతడితో జరిపిన చాట్‌లను ఆమె డిలీట్ చేయలేకపోయిందన్నాడు. ఆమె 20రోజుల తర్వాత కూడా ఆధారాలను తుడిచి పెట్టలేకపోయిందని తెలిపాడు. ‘‘ షారూఖ్‌ను వేధింపులకు గురి చేయడానికే ఆర్యన్‌ను అరెస్టు చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా కింగ్ ఖాన్ మద్దతు తెలపకపోవడంతో ఎన్సీబీ ఈ విధంగా వ్యవహరిస్తోంది. త్వరలో జాన్వీ కపూర్ కజిన్, సంజయ్ కపూర్ కూతురు శనయ కపూర్‌ను కూడా ఎన్సీబీ విచారణకు పిలుస్తోంది ’’ అని ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేశారు. 


ఎన్సీబీ అధికారులు అక్టోబర్ 2న క్రూయిజ్‌లో జరిగిన రేవ్ పార్టీలో ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. అర్బాజ్ మర్చంట్ వద్ద కొద్ది మొత్తంలో డ్రగ్స్ లభించగా ఆర్యన్ వద్ద ఎటువంటి మాదక ద్రవ్యాలు లభించలేదు. ప్రస్తుతం ముంబైలోని అర్థర్ రోడ్ జైలులో ఆర్యన్ ఉన్నాడు.

Bollywoodమరిన్ని...