Abn logo
Sep 21 2020 @ 08:06AM

సైఫ్‌ను పెళ్లాడేందుకు కరీనా పెట్టిన షరతు ఇదే!

Kaakateeya

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఈరోజు(సెప్టెంబరు 21) తన పుట్టినరోజు చేసుకుంటోంది. 1980, సెప్టెంబరు 21న ఆమె జన్మించింది. ఈరోజ ఆమె 40వ బర్త్ డే. ఆమె తన సినీ కెరియర్‌లో ఎన్నో విజయాలను అందుకుంది. కరీనా వివాహానికి సంబంధించిన ఒక ఆసక్తికర అంశం మీడియాలో చెక్కర్లు కొడుతుంటుంది. 2012లో ఆమె నటుడు సైఫ్ అలీఖాన్‌ను వివాహం చేసుకుంది. సైఫ్‌కు ఆమెకు పదేళ్ల వయసు తేడా ఉంది. ఈ అంశం అప్పట్లో చర్చనీయంగా మారింది. ఈ జంట వివాహానికి వయసు అడ్డుకాదని నిరూపించింది. ఒక సినిమా షూటింగ్‌లో వీరి మధ్య ప్రేమ చిగురించింది.

ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ, వీరి ప్రేమ విజయవంతమయ్యింది. ఆ రోజుల్లో సైఫ్ తన శరీరంపై కరీనా పేరును టాటూ వేయించుకోవడంతో వీరి ప్రేమ విషయం వెలుగులోకి వచ్చింది. వీరు తమ ప్రేమను దాచిపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు.  వీరు ప్రేమికులుగా ఉన్న రోజుల్లోనే పార్టీలకు జంటగా హాజరయ్యేవారు. కాగా కరీనా ఒక ఇంటర్యూలో తాను సైఫ్‌ను వివాహం చేసుకునేందుకు ఒక షరతు విధించానని తెలిపింది. తాను పెళ్లయిన తరువాత కూడా కెరియర్ కొనసాగిస్తానని, డబ్బులు సంపాదిస్తానని, అందుకు జీవితాంతం సహకరించాలని కోరానని తెలిపింది. అందుకు సైఫ్ ఒప్పుకున్నాకనే వివాహం చేసుకున్నానని కరీనా వివరించింది. వీరికి వివాహం జరిగి నాలుగేళ్లయ్యాక 2016 డిసెంబరు 20న  వీరికి కుమారుడు జన్మించాడు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కరీనా ‘తైమూర్’కు జన్మనిచ్చింది. ఇప్పుడు కరోనా మరోమారు గర్భవతి అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. 

Advertisement
Advertisement
Advertisement