Abn logo
Nov 26 2020 @ 12:51PM

ఈ హీరోను గుర్తు పట్టారా?

పై ఫొటోలోని హీరోని గుర్తు పట్టారా? పెద్ద కళ్లజోడు, బట్ట బుర్ర, కామన్ మ్యాన్ తరహాలో ఉన్న ఈ హీరో మరెవరో కాదు.. బాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్ బచ్చన్. ఇటీవలె కరోనా నుంచి కోలుకున్న అభిషేక్ తన కొత్త సినిమా `బాబ్‌ బిస్వాస్‌` కోసం ఇలా మారిపోయాడు. 


ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కోల్‌కతాలో జరుగుతోంది. ఆ సినిమా సెట్స్ నుంచి లీకైన అభిషేక్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. షారుక్‌ ఖాన్‌ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాను  అన్నపూర్ణ ఘోష్ తెరకెక్కిస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement