ఆర్‌ఆర్‌ఆర్‌లో అలియా గానం

ABN , First Publish Date - 2021-02-14T08:49:30+05:30 IST

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌, రామ్‌చరణ్‌కు జోడీగా నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఆర్‌ఆర్‌ఆర్‌లో అలియా గానం

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో బాలీవుడ్‌ కథానాయిక అలియా భట్‌, రామ్‌చరణ్‌కు జోడీగా నటిస్తోన్న విషయం తెలిసిందే. తన అందచందాలతోనే కాదు తన కమ్మని గొంతుతోనూ ప్రేక్షకులను అలరించడానికి ఆమె సిద్ధమవుతున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో అలియా ఓ పాట కూడా పాడబోతున్నారని బాలీవుడ్‌ సమాచారం. గతంలో ‘హైవే’, హంప్టీ శర్మకీ దుల్హనియా’ చిత్రాల్లో తన పాటలు తానే పాడుకున్న అనుభవం అలియాకు ఉంది.  


‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో అలియాపైన నృత్య ప్రధానంగా సాగే ఓ భారీసాంగ్‌ను తెరకెక్కిస్తున్నారట. హిందీ వెర్షన్‌లో అలియా ఈ  పాటను పాడబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో మాత్రం వేరే వాళ్లతో పాడిస్తారు. అలియా టైటిల్‌ పాత్రను పోషిస్తున్న ‘గంగూబాయ్‌ కతియావాడి’ చిత్రంలో ఆమెకు శ్రేయా ఘోషల్‌ పాడుతున్నారు.

Updated Date - 2021-02-14T08:49:30+05:30 IST