May 7 2021 @ 13:37PM

నాగ్ సరసన బాలీవుడ్ హీరోయిన్..?

అక్కినేని నాగార్జున నటించబోయో సినిమా ద్వారా బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌కి పరిచయం కాబోతుందనే వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున డ్యూయల్ రోల్‌లో నటించిన సోగ్గాడే చిన్ని నాయనా 2015 సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్‌గా బంగారాజు నిర్మించబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు. కరోనా కారణంగా ఇన్నాళ్ళు మొదలవని ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా పేరును పరిశీలిస్తున్నారట. ఇటీవలే వైల్డ్ సినిమాలో దియా మీర్జా నటించింది. మరోసారి బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోవాలని చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సీక్వెల్‌ని కూడా కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించబోతున్నాడు.