Apr 11 2021 @ 11:55AM

టాలీవుడ్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్..హిట్ కొడతారా..?

టాలీవుడ్‌లో గత కొన్నేళ్ళుగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ వచ్చి అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ టాలీవుడ్‌లో అందరూ స్టార్ హీరోయిన్ కాలేకపోతున్నారు. అందరికీ లక్ కలిసి రావడం లేదు. బాలీవుడ్‌లో ఒక వెలుగు వెలుగుతున్న స్టార్ హీరోయిన్స్ టాలీవుడ్‌లో మాత్రం ఆ క్రేజ్‌ని దక్కించుకోలేకపోతున్నారు. అయిన మనవాళ్ళు బారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి ఇక్కడి తీసుకు వస్తున్నారు. అందుకు కారణం ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్ ఇండియన్ సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతుండటమే. 

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ - మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో ప్రముఖ నిర్మాణ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక సినిమా నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ప్రభాస్‌కి జంటగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్‌లో ఉండగా ఈ ఏడాది ద్వితీయార్థలో సెట్స్ మీదకి రాబోతోందని సమాచారం. ఇక విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న లైగర్ సినిమా సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. ఈ క్రమంలోనే టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా మేజర్ సినిమా తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాత. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ టాలీవుడ్‌కి ఈ సినిమాతో పరిచయమవుతోంది. 

రీసెంట్‌గా మేజర్ సినిమా నుంచి సాయీ మంజ్రేకర్ లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమాలో కూడా సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ద్వారా టాలీవుడ్‌కి రాబోతోంది. అల్లూరి సీతారామరాజు భార్య పాత్ర సీతగా ఆలియా భట్ గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. వీరిలో ఆలియా భట్, దీపిక పదుకొణె బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌గా వెలుగుతున్నారు. మరి టాలీవుడ్‌లో ఎంతవరకు సక్సస్ అవుతారన్నది రానున్న రోజుల్లో తేలిపోతుంది. ప్రభాస్ నటించిన సాహో సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ద కపూర్‌కి ఇక్కడ ఆదరణ  పెద్దగా లభించలేదన్న మాట వినిపించింది.