నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 106వ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారు? అనే దానిపై చాలా వార్తలు వినిపించాయి. తాజా సమాచారం మేరకు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి విలన్‌గా కనిపించబోతున్నారట. సునీల్ శెట్టి ఈమధ్య ఎక్కువగా దక్షిణాది సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దర్బార్, పహిల్వాన్ వంటి సినిమాల్లో నటించిన సునీల్ శెట్టి ఇప్పుడు మంచు విష్ణు మోసగాళ్లు చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో నటించనున్నట్లు టాక్ హల్ చల్ చేస్తుంది. సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో హీరోయిన్ పూర్ణ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.