Afghanistanలో తాలిబన్ వాహనాలపై దాడులు

ABN , First Publish Date - 2021-09-18T21:32:10+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో తాలిబన్ల వాహనాలపై శనివారం దాడులు జరిగాయి.

Afghanistanలో తాలిబన్ వాహనాలపై దాడులు

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో తాలిబన్ల వాహనాలపై శనివారం దాడులు జరిగాయి. మూడు పేలుళ్ళలో కనీసం ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తాలిబన్లు కూడా ఉన్నారు. ఈ పేలుళ్ళలో సుమారు 20 మంది గాయపడ్డారు. 


నన్‌గర్హర్ ప్రావిన్స్ రాజధాని నగరం జలాలాబాద్‌లో ఓ రోడ్డు పక్కన ఉన్న బాంబును ఓ తాలిబన్ రేంజర్ కొట్టడంతో అది పేలిందని స్థానిక అధికారులు మీడియాకు చెప్పారు. మృతుల్లో ఇద్దరు తాలిబన్ అధికారులు ఉన్నారని చెప్పారు. గాయపడినవారిలో అత్యధికులు సాధారణ పౌరులని తెలిపారు. వీరిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు.


కాబూల్‌లో ఓ బాంబు పేలడంతో ఇద్దరు గాయపడినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఈ బాంబు పేలుడు వెనుక లక్ష్యం ఏమిటో తెలియడం లేదని చెప్పారు. జలాలాబాద్ పేలుడు తాలిబన్ల లక్ష్యంగానే జరిగిందని, అయితే అందుకు పాల్పడినవారెవరో ఇంకా తెలియలేదని, దీనికి తమదే బాధ్యత అని ఎవరూ ప్రకటించలేదని చెప్పారు. 


కాబూల్ నుంచి 80 మైళ్ళ దూరంలో జలాలాబాద్ నగరం ఉంది. ఇది ఆఫ్ఘనిస్థాన్‌లో ఐదో అతి పెద్ద నగరం. 


Updated Date - 2021-09-18T21:32:10+05:30 IST