Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 16 2021 @ 09:40AM

West Bengal: న్యూ జల్పాయ్‌గుడి రైల్వేస్టేషన్ ముందు బాంబు

న్యూ జల్పాయ్ గుడి : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో బాంబును రైల్వే పోలీసులు కనుగొన్నారు. న్యూ జల్పాయిగుడి రైల్వే స్టేషన్ ఎంట్రీ పాయింట్ వద్ద బాంబు లభ్యమైందని పోలీసులు చెప్పారు. రైల్వే పోలీసులు హుటాహుటిన  బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌ను పిలిచారు.బాంబు డిస్పోజల్ స్క్వాడ్ బాంబును నిర్వీర్యం చేసింది. ఇది దేశీయంగా తయారు చేసిన బాంబు అని పోలీసులు చెబుతున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని న్యూ జల్పాయిగురి స్టేషన్ రైల్వే పోలీస్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఏజీ ఫరూఖ్ విలేకరులకు చెప్పారు. భయాందోళనలు సృష్టించాలనే లక్ష్యంతో రైల్వేస్టేషను వద్ద ఆగంతకులు బాంబు పెట్టారని పోలీసులు చెప్పారు. బాంబు ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పశ్చిమ బెంగాల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు చెప్పారు. బాంబు ఘటనతో భద్రతా ఏర్పాట్లు పెంచి, రైల్వేస్టేషనులో ముమ్మర తనిఖీలు చేస్తున్నామని రైల్వే పోలీసులు చెప్పారు.


Advertisement
Advertisement