Abn logo
Sep 24 2021 @ 11:50AM

ప్రేమించాను కానీ మా జాతకాలు కుదర్లేదని పెళ్లికి నో చెప్పా.. నా తప్పేముంది..? ఓ కుర్రాడి ప్రశ్న.. దిమ్మతిరిగే సమాధానమిచ్చిన హైకోర్టు..

అతడు ఆమెను ప్రేమలోకి దింపాడు.. శారీరకంగా దగ్గరయ్యాడు.. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు.. అయితే అతను తన మాట నిలబెట్టుకోలేదు.. దీంతో యువతి పోలీసులను ఆశ్రయించింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.. తాజాగా బెయిల్ కోరుతూ నిందితుడు కోర్టులో పిటిషన్ వేశాడు.. జాతకాలు కుదరకపోవడం వల్లే పెళ్లి చేసుకోలేదని చెప్పాడు.. పిటిషన్‌ను విచారించిన కోర్టు నిందితుడికి షాకిచ్చింది.. 


బాద్లాపూర్‌కు చెందిన యువకుడు 2012లో ఓ హోటల్‌లో పనిచేస్తున్న సమయంలో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెను ప్రేమలోకి దింపి శారీరకంగా దగ్గరయ్యాడు. ఫలితంగా ఆ యువతి గర్భం దాల్చింది. కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి అబార్షన్ చేయించాడు. అనంతరం మొహం చాటేశాడు. దీంతో ఆ యువతి 2013, జనవరి 6న పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు యువకుడి కుటుంబాన్ని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసుల సమక్షంలో యువకుడి కుటుంబం పెళ్లికి అంగీకరించింది. దీంతో యువతి తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. అయితే ఆ యువకుడు మాట నిలబెట్టుకోలేదు. పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


ఇవి కూడా చదవండి

భర్తకు `ఐ లవ్యూ` అంటూ మెసేజ్.. అతడు ఇంటికి రావడం చూసి..



బెయిల్ కోసం అప్లై చేసిన నిందితుడు.. వింత షరతులు విధించిన కోర్టు!



కేసు నమోదు చేసుకున్న పోలీసులు అత్యాచార చట్టాల కింద నిందితుడుని అరెస్ట్ చేశారు. తాజాగా అతడి తరఫు న్యాయవాది బాంబే హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేశారు. జాతకాలు కుదరకపోవడం వల్లే యువతిని తన క్లయింటు పెళ్లి చేసుకోలేదని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి నిందితుడికి బెయిలు నిరాకరించారు. బాధిత యువతిని పెళ్లి చేసుకునే ఉద్దేశం యువకుడికి లేదని, అందుకే జాతకాల పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడని వ్యాఖ్యానించారు. అతడికి బెయిలు మంజూరు చేసేది లేదని తీర్పునిచ్చారు. 

ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...