Abn logo
Sep 29 2020 @ 20:04PM

రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌పై తీర్పును..

Kaakateeya

ముంబై: సుశాంత్ అనుమానాస్పద మృతి కేసుకు సంబంధించిన డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి బెయిల్ పిటిషన్‌పై ముంబై హైకోర్టులో విచారణ పూర్తయింది. రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును కోర్టు రిజర్వ్‌లో ఉంచింది. సెప్టెంబర్ 4న రియా సోదరుడు షోవిక్‌ను, సెప్టెంబర్ 8న రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది. రియా చక్రవర్తి జ్యుడీషియల్ కస్టడీ గడువు అక్టోబర్ 6తో ముగియనుంది.

రియా చక్రవర్తి ప్రస్తుతం బైకులా జైలులో ఉండగా, ఆమె సోదరుడు షోవిక్ తలోజాను సెంట్రల్ జైలులో ఉంచారు. అయితే.. రియా, షోవిక్ బెయిల్ పిటిషన్లపై ఎన్‌సీబీ అభ్యంతరం తెలిపింది. రియా, షోవిక్ డ్రగ్స్ సిండికేట్‌లో సభ్యులని.. ప్రముఖలందరికీ డ్రగ్స్ సరఫరా చేసిన వారితో వీరిద్దరికీ సంబంధాలున్నాయని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఎన్‌సీబీ ప్రధానంగా పేర్కొంది. సుశాంత్‌కు రియా డ్రగ్స్ అందించిందని ఎన్‌సీబీ కోర్టుకు తెలిపింది.


Advertisement
Advertisement
Advertisement