Abn logo
Sep 24 2021 @ 17:31PM

వరవరరావు బెయిల్‌ను మరోసారి పొడిగించిన బాంబే హైకోర్టు

ముంబై: విరసం నేత వరవరరావు బెయిల్‌ను బాంబే హైకోర్టు మరోసారి పొడిగించింది. తెలంగాణకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వరవరరావు పిటిషన్ దాఖలు చేశారు. వరవరవరరావు పిటిషన్‌ విచారణను అక్టోబర్ 13కు కోర్టు వాయిదా వేసింది. అక్టోబర్ 13 వరకు ఇదే స్థితిని కొనసాగించాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. వరవరరావు బాంబేలోనే అక్టోబర్‌ 13 వరకు ఉండాలని కోర్టు పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలోని తన ఇంట్లో ఉండేందుకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా తాను ఆరోగ్య సమస్యలతోనే బాధపడుతున్నానని, బెయిల్‌ మంజూరు చేస్తూ కోర్టు విధించిన ఒక్క షరతును కూడా తాను ఉల్లంఘించలేదని ఆయన గుర్తుచేశారు. ఈనేపథ్యంలో బెయిల్‌ షరతుల్లో కొంత సడలింపును పొందే అర్హత తనకు ఉందని వరవరరావు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

తెలంగాణ మరిన్ని...