Oct 24 2021 @ 12:58PM

"Bommarillu" Bhaskar : గీతా‌ఆర్ట్స్ లో మరో సూపర్ ఆఫర్ ?

‘బొమ్మరిల్లు, పరుగు’ చిత్రాల తర్వాత దర్శకుడు భాస్కర్ .. వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు.  చాలా రోజులు ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్న ఆయనకి గీతాఆర్ట్స్ వారు పిలిచి మరీ సినిమా ఇచ్చారు. ఆ సినిమా ఇటు అఖిల్‌కు, అటు భాస్కర్‌కు మరిచిపోలేని సినిమా అయింది. అఖిల్ నాలుగో చిత్రంగా రూపొందిన ఆ సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ అన్న సంగతి తెలిసిందే. హీరో అఖిల్ స్ర్కీన్ ప్రెజెన్స్, పూజా హెగ్డే గ్లామర్ అపీరెస్స్, భాస్కర్ మేకింగ్ స్కిల్స్  వెరశి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. గీతా ఆర్ట్స్ వారి నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా.. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడంతో.. ఆయనకి మళ్ళీ గీతా ఆర్ట్స్ లోనే మరో బ్రహ్మాండమైన ఆఫర్ వచ్చినట్టు సమాచారం. మరో యూత్ ఫుల్ మూవీకి కథ రెడీ చేసుకోమని, ఓ యంగ్ హీరోతో సినిమా తెరకెక్కిస్తామని గీతా ఆర్ట్స్ భాస్కర్ కు చెప్పారట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆయన.. ప్రస్తుతం ఈ చిత్రం కోసం మంచి కథ రెడీ చేస్తున్నట్టు టాక్. ఈసారి ఓ అద్భుతమైన పాయింట్ తో భాస్కర్ రాబోతున్నారట. దిల్ రాజు బ్యానర్ నుంచి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి సెన్సేషనల్ హిట్ సాధించిన భాస్కర్ .. గీతా ఆర్ట్స్ బ్యానర్ తో రీ ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు అదే రేంజ్ లో హిట్టివ్వడం విశేషంగా మారింది. మరి భాస్కర్ ఈ సారి ఏ పాయింట్ తో వస్తారో చూడాలి.