అట్టహాసంగా మాజీ జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి జన్మదినం

ABN , First Publish Date - 2021-07-25T02:56:45+05:30 IST

పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ శాసన మండలి సభ్యుడు, మాజీ జడ్పీ చైర్మన్‌, టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం అట్టహాసంగా నిర్వహించారు.

అట్టహాసంగా మాజీ జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి జన్మదినం
బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి జన్మదిన కేక్‌ కట్‌ చేస్తున్న టీడీపీ నాయకులు

ఆత్మకూరు, జూలై 24: పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ శాసన మండలి సభ్యుడు, మాజీ జడ్పీ చైర్మన్‌, టీడీపీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బొమ్మిరెడ్డి రాఘవేంద్రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు కేక్‌ కట్‌ చేసి మిఠాయిలు పంచి, బాణాసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దావా పెంచలరావు, పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, మహిళా నాయకురాలు పులిమి శైలజరెడ్డి, రూరల్‌ మండల ప్రధాన కార్యదర్శి కేతా విజయ భాస్కర్‌రెడ్డి,  తుమాటి శశిధర్‌రెడ్డి, తలచీరు బాబు నాయుడు, టీ పెంచలయ్య, ప్రవీణ్‌, గోపాల్‌, తిరుపతి నాయుడు, మాదాల హజరత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T02:56:45+05:30 IST