బొమ్మూరులో సైన్స్‌ మ్యూజియం

ABN , First Publish Date - 2021-11-30T06:56:15+05:30 IST

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి), నవంబరు 29: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజమహేంద్రంలో ఏదొకటి ఏర్పాటుచేయాలని గత ప్రభుత్వంలో అప్పటి ఎంపీ మాగంటి మురళీమోహన్‌ చేసిన ప్రయత్నంతో కేంద్రం సైన్స్‌ మ్యూజియం (సైన్స్‌సెంటర్‌) మంజూరు చేసింది. రూ.15.20 కోట్లతో దీని నిర్మాణానికి ప్రతిపాదించారు. పుష్క

బొమ్మూరులో సైన్స్‌ మ్యూజియం

వచ్చే ఏడాది ఆగస్టుకు పూర్తి చేస్తామని 

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్లమెంటులో ప్రకటన

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి), నవంబరు 29: రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజమహేంద్రంలో ఏదొకటి ఏర్పాటుచేయాలని గత ప్రభుత్వంలో అప్పటి ఎంపీ మాగంటి మురళీమోహన్‌ చేసిన ప్రయత్నంతో కేంద్రం సైన్స్‌ మ్యూజియం (సైన్స్‌సెంటర్‌) మంజూరు చేసింది.  రూ.15.20 కోట్లతో దీని నిర్మాణానికి ప్రతిపాదించారు.  పుష్కరఘాట్‌ సమీపంలో పెట్టాలని, తర్వాత చాలాచో ట్ల భూసేకరణకు ప్రయత్నించారు. చివరకు బొమ్మూరు మహిళా ప్రాంగణంలోని భూమిని సేకరించి అక్కడ శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రభుత్వం మారడం,  కొవిడ్‌ ప్రభావంతో అది శిలాఫలకంగానే ఉండిపో యింది. ప్రస్తుత ఎంపీ మార్గాని భరత్‌ దీనిపై కేంద్రం లో పలువురిని సంప్రదించారు. చివరకు ఇటీవల ఈ పనులు మొదలయ్యాయి. ఇక్కడ 8,9,10 తరగతి పిల్ల లకు సంబంధించిన సైన్స్‌ పరికరాలు అన్నీ ఉంటాయి. సోమవారం పార్లమెంట్‌లో కేంద్ర టూరిజం శాఖ మం త్రి కిషన్‌రెడ్డి దీనిపై ప్రకటన చేయడం, వచ్చే ఏడాది ఆగస్టుకి దీన్ని పూర్తిచేస్తామని ప్రకటించడంతో ఇక చురుగ్గా పనులు జరుగుతాయని భావిస్తున్నారు.

Updated Date - 2021-11-30T06:56:15+05:30 IST