Abn logo
Apr 14 2021 @ 13:37PM

అంబేద్కర్‌కు నివాళులర్పించిన బోండా ఉమ

విజయవాడ: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ 130వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమమహేశ్వరరావు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాలకు సమాజంలో సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అంబేద్కర్ దేశానికి, దేశ ప్రజలకు చేసిన అనేక సేవలు, కృషి ఎనలేనివని అన్నారు. బలమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చి మహిళలు, దళిత వర్గాలకు కొండంత అండగా నిలిచారని బోండా ఉమ వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement
Advertisement