ఇసుక మాఫియాకి వైసీపీ ప్రభుత్వం లైసెన్సు: బోండా ఉమా

ABN , First Publish Date - 2021-08-16T16:30:05+05:30 IST

వైసీపీ ఇసుక మాఫియా చేవిటికల్లులో మీడియా సాక్షిగా దొరకిపోయిందని బోండా ఉమా అన్నారు.

ఇసుక మాఫియాకి వైసీపీ ప్రభుత్వం లైసెన్సు: బోండా ఉమా

విజయవాడ: వైసీపీ ఇసుక మాఫియా చేవిటికల్లులో మీడియా సాక్షిగా దొరకిపోయిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక్క చోటే వందల లారీలతో ఇసుకను పక్క రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తోందన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాకి వైసీపీ ప్రభుత్వం లైసెన్సు ఇచ్చిందన్నారు. చెవిటికల్లులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న లారీలపై కేసు పెట్టకుండా వదిలేస్తున్నారని, నది గర్భంలోని ఇసుకను తోడేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టుల దృష్టికి తీసుకువెళతామన్నారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇచ్చిన ఇసుకను వైసీపీ లారీ రూ.30 వేలు చేసిందని, ఈ విధంగా రోజుకి ఇసుకపై వైసీపీ ఆదాయం రూ. 300 కోట్లపైనే అని అన్నారు. రాష్ట్రంలో కొన్న ఇసుకకి బిల్లు కూడా ఇవ్వటం లేదంటే దోపిడీ ఎలా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో విజిలెన్స్, పోలీసు, సీబీసీఐడీ ప్రత్యర్ధులను వేధించడానికే పరిమితం అయిందని బోండా ఉమా తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Updated Date - 2021-08-16T16:30:05+05:30 IST