Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ పాలనలో ప్రజలకు నిత్యం కష్టాలే!: బొండా ఉమా

వన్‌టౌన్‌, నవంబరు 28: వైసీపీ పాలనలో ప్రజలకు నిత్యం కష్టాలే మిగిలాయని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. మీసాల రాజేశ్వరరావు వంతెన సమీపంలో నివాసం ఉంటున్న పేదలను ఆయన పరామర్శించి, వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తాను ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని తెలిపారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క చాన్స్‌ అన్నందుకు ప్రజలు అవకాశం ఇచ్చారని, ఇప్పుడు ఎప్పుడు తరిమి కొడదామా అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు బాగా పెరిగాయని, ప్రభుత్వం మేల్కొని ధరలు తగ్గించాలని ఉమా డిమాండ్‌ చేశారు. చలమలశెట్టి శ్రీనివాస్‌, పాములపాటి మాధవప్రసాద్‌, బోసు, సుందరయ్య, పిప్రసాద్‌, నందేటి చంద్రభానుసింగ్‌, దుర్గ, వేణుగోపాల్‌ సింగ్‌, మోహన్‌, మధు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement