ఆ సర్జరీతో ఎముకలు బలహీనం

ABN , First Publish Date - 2020-11-30T19:46:48+05:30 IST

అధిక బరువుతో బాధపడే వాళ్లు బేరియాట్రిక్‌ సర్జరీల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయని ఒక అధ్యయనంలో వెల్లడయింది.

ఆ సర్జరీతో ఎముకలు బలహీనం

ఆంధ్రజ్యోతి(30-11-2020)

అధిక బరువుతో బాధపడే వాళ్లు బేరియాట్రిక్‌ సర్జరీల వైపు మొగ్గు చూపుతుంటారు. అయితే బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయని ఒక అధ్యయనంలో వెల్లడయింది. బరువు తగ్గడం కోసం చాలా మంది స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమీ అనే సర్జరీని ఎంచుకుంటారు. ఈ సర్జరీలో భాగంగా ఆహారం తీసుకునే పరిమాణం తగ్గడం కోసం 75 శాతం జీర్ణాశయంను తగ్గిస్తారు. అయితే దీనివల్ల ఎముకలు బలహీనపడిపోతాయి. బోస్టన్‌ హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. ‘‘స్లీవ్‌ గ్యాస్ట్రెక్టమీ చేయించుకున్న వారిలో బోన్‌ డెన్సిటీ బాగా తగ్గిపోయింది. ఎముకలు సులభంగా విరిగిపోయే అవకాశం ఉంది’’ అని అధ్యయనంలో పాలుపంచుకున్న మిరియం ఎ బ్రెడెల్లా వివరించారు. 

Updated Date - 2020-11-30T19:46:48+05:30 IST