‘విశ్వదర్పణ్‌’ పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2021-07-31T06:00:33+05:30 IST

‘విశ్వదర్పణ్‌’ హిందీ

‘విశ్వదర్పణ్‌’ పుస్తకావిష్కరణ
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అతిథులు వినోద్‌కుమార్‌, శివకుమార్‌, తదితరులు

రవీంద్రభారతి, జూలై 30 (ఆంధ్రజ్యోతి): సాహి త్య రచనల ద్వారా సమాజంలో మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స హాల్‌లో అక్షరయాన ఆధ్వర్యంలో ప్రముఖ కవి డాక్టర్‌ వడ్డేపల్లి కృష్ణ జన్మదినం సందర్భంగా ‘విశ్వదర్పణ్‌’ హిందీ పుస్తకం ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వినోద్‌కుమార్‌ పుస్తకాన్ని ఆవిష్కరించి వడ్డేపల్లిని సత్కరించి అభినందించారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన బి.శివకుమార్‌ మాట్లాడుతూ వడ్డేపల్లి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విశ్వదర్పణ్‌ పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన, మరింగంటి లక్ష్మణాచార్యులు, రమాదేవి కులకర్ణి, బైసా దేవదాస్‌, ఐనంపూడి శ్రీలక్ష్మి పాల్గొని వడ్డేపల్లి కృష్ణను సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-07-31T06:00:33+05:30 IST