సాఫ్ట్‌ స్కిల్స్‌ను పాఠ్యాంశంగా బోధించాలి

ABN , First Publish Date - 2020-12-04T06:01:25+05:30 IST

సాఫ్ట్‌ స్కిల్స్‌ను విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

సాఫ్ట్‌ స్కిల్స్‌ను పాఠ్యాంశంగా బోధించాలి
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వీసీ ప్రసాద్‌రెడ్డి, తదితరులు

ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి

ఏయూ క్యాంపస్‌, డిసెంబరు 3: సాఫ్ట్‌ స్కిల్స్‌ను విద్యార్థులకు పాఠ్యాంశంగా బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఏయూ అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో రైటర్స్‌ అకాడమీ నిర్వహించిన కార్యక్రమంలో ఏయూ జర్నలిజం విభాగం విశ్రాంత ఆచార్యుడు పి.బాబీవర్ధన్‌, ఏయూ సాఫ్ట్‌ స్కిల్స్‌ శిక్షకుడు డాక్టర్‌ చల్లా కృష్ణవీర్‌ అభిషేక్‌ సంయుక్తంగా రచించిన పుస్తకం ‘ప్లీట్‌ బుక్‌ ఆన్‌ సాప్ట్‌ స్కిల్స్‌’ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విశ్రాంత ఆచార్యులు నేటి తరం యువతతో కలిసి సంయుక్తంగా పుస్తక రచన చేయాలని సూచించారు. రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌ మాట్లాడుతూ ఈ పుస్తకం ఉపాధి కల్పనలో ఎంతో కీలకంగా నిలుస్తుందన్నారు. పుస్తక రచయితల్లో ఒకరైన బాబీవర్ధన్‌ మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి, భావ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-04T06:01:25+05:30 IST