చచ్చిన వాళ్లను కూడా వదలడం లేదు: కేంద్రంపై మెహబూబా ఫైర్

ABN , First Publish Date - 2021-09-06T00:35:02+05:30 IST

వేర్పాటువాద నేత సైయద్ అలీ గిలానీ మృతదేహంపై పాక్ జెండా కప్పడంతో పాటు దేశ వ్యతిరేక..

చచ్చిన వాళ్లను కూడా వదలడం లేదు: కేంద్రంపై మెహబూబా ఫైర్

శ్రీనగర్: వేర్పాటువాద నేత సైయద్ అలీ గిలానీ మృతదేహంపై పాక్ జెండా కప్పడంతో పాటు దేశ వ్యతిరేక నినాదాలు చేశారన్న అభియోగంపై పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తప్పుపట్టారు. కేంద్రంలో మోదీ సారథ్యంలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. కశ్మీర్‌ను బహిరంగ జైలుగా మార్చడమే కాకుండా చచ్చిన వాళ్లను కూడా విడిచిపెట్టడం లేదంటూ మండిపడ్డారు.


''తాము కోరుకున్న విధంగా అంతిమ సంస్కారాలు జరిపేందుకు, తుది వీడ్కోలు పలుకేందుకు కూడా వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వలేదు. గిలానీ కుటుంబ సభ్యులపై యూఏపీఏ చట్టం కింద భారత ప్రభుత్వం కేసు పెట్టడం వాళ్ల కర్కశత్వాన్ని చాటుతోంది'' అని మెహబూబా ముఫ్తీ ఓ ట్వీట్‌లో విమర్శించారు. గిలానీ మృతదేహంపై పాక్ జెండా కప్పిన్టటు చూపించే ఓ వీడియోను పరిగణనలోకి తీసుకుని బుద్గాం పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

Updated Date - 2021-09-06T00:35:02+05:30 IST