క్రీడలను ప్రోత్సహిస్తా

ABN , First Publish Date - 2021-01-20T05:52:43+05:30 IST

పాఠశాలల స్థాయి నుంచి ప్రభుత్వం క్రీడలను ప్రొత్సాహిస్తోందని రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

క్రీడలను ప్రోత్సహిస్తా
విన్నర్‌ జట్టుకు సీల్డు పంపిణీ చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖామాత్యులు ఆదిమూలపు సురేష్‌

రాష్ట్ర విద్యాశాఖామాత్యులు ఆదిమూలపు సురేష్‌

 ఎర్రగొండపాలెం, జనవరి 19 :  పాఠశాలల స్థాయి నుంచి ప్రభుత్వం  క్రీడలను ప్రొత్సాహిస్తోందని రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ఎర్రగొండపాలెంలో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్‌ టోర్నమెంటు విజేతలకు మంగళవారం సాయంత్రం బహుమతులు పంపిణీ కార్యక్రమానికి మంత్రి సురేష్‌ హాజరై మాట్లాడారు.  రాష్ట్రం క్రీడల విభాగంలో నియోజకవర్గాన్ని ప్రోత్సహిస్తామన్నారు. ఎర్రగొండపాలెం  ప్రభుత్వ పాఠశాల క్రీడామైదానంలో అన్ని క్రీడలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. వచ్చే సంవత్సరానికి క్రికెట్‌ టోర్నమెంటుకు అనువుగా మ్యాట్స్‌ను మంజూరు చేయిస్తానని అన్నారు.  నియోజకవర్గంలోని పాఠశాలల్లో  క్రీడల్లో నైపుణ్యం ఉన్న విద్యార్ధులు ఉన్నారని అన్నారు. 

విజేతలకు బహుమతుల పంపిణీ

 వైఎస్సార్‌ క్రికెట్‌టోర్నమెంటు విజేతలుగా నిలిచిన నూర్‌ 11 బుల్లెట్స్‌ (ఎర్రగొండపాలెం) జట్టుకు రూ.20116 నగదును, జ్ఞాపికను విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌ బహుకరించారు. క్రికెట్‌ టోర్నమెంటులో రన్నర్స్‌గా విజయంసాధించిన అఖిల్‌ క్రికెట్‌ నరజాముల జట్టుకు రూ.10116 వేలు నగదు, జ్ఞాపికను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ క్రికెట్‌ టోర్నమెంటు నిర్వాహకులు పట్టణ మైనార్టీసెల్‌ అధ్యక్షుడు ఎస్‌ ఎం జబీబుల్లా, ఏఎంసీ చైర్మన్‌ ఒంగోలు మూర్తిరెడ్డి, మండల కన్వీనరు డి కిరణ్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ విజయబాస్కర్‌, పుల్లలచెరువుమండల కన్వీనరు ఉడుముల శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సభ్యులు ఐవీ సుబ్బారావు, నవోదయపాఠశాల డైరక్టరు కందూరు గురుప్రసాదు, మాజీ సొసైటి అధ్యక్షుడు ఓబులరెడ్డి, వైసీపీ మహిళా అధ్యక్షురాలు అరుణాబాయ్‌, నర్రెడ్ల వెంకటరెడ్డి, సొసైటి చైర్మన్‌ దండా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-01-20T05:52:43+05:30 IST