బోరును సీజ్ చేశారని.. మహిళ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-08-10T21:00:47+05:30 IST

యాదాద్రి-భువనగిరి : జీవనాధారమైన బోరును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారని.. ఓ మహిళ ఆత్మహత్యానికి పాల్పడింది.

బోరును సీజ్ చేశారని.. మహిళ ఆత్మహత్యాయత్నం

యాదాద్రి-భువనగిరి : జీవనాధారమైన బోరును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారని.. ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మోటకొండూర్ మండలం రాయికుంటపల్లికి చెందిన కొరటికంటి నర్సమ్మ అనే మహిళ.. గ్రామ చెరువు శిఖానికి సంబంధించిన ఎకరం భూమిలో 40 ఏళ్ళుగా వ్యవసాయం చేసుకుంటోంది. అయితే పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు బోరును సీజ్ చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మహిళ.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు హుటాహుటిన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. 40 ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా లాక్కోవడానికే.. బోరు సీజ్ చేశారని ఆరోపిస్తూ మోటకొండూర్ తహసీల్దారు ఆఫీసు ముందు స్థానికులు ఆందోళన చేపట్టారు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-08-10T21:00:47+05:30 IST