విరసం సాహిత్య పాఠశాల

ABN , First Publish Date - 2021-04-09T05:36:34+05:30 IST

విప్లవ రచయితల సంఘం మొదట ఏప్రిల్ 10, 11 శని, ఆదివారాల్లో విజయవాడలో నిర్వహించ తలపెట్టిన సాహిత్య పాఠశాల కరోనా తీవ్రత కారణంగా...

విరసం సాహిత్య పాఠశాల

విప్లవ రచయితల సంఘం మొదట ఏప్రిల్ 10, 11 శని, ఆదివారాల్లో విజయవాడలో నిర్వహించ తలపెట్టిన సాహిత్య పాఠశాల కరోనా తీవ్రత కారణంగా ఒక రోజుకు కుదించబడింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కందుకూరి కళ్యాణ మండపం, జింఖానా గ్రౌండ్స్, గాంధీనగర్, విజయవాడలో ఈ సాహిత్య పాఠశాల జరుగుతుంది. పతాకావిష్కరణ తర్వాత అరసవెల్లి క్రిష్ణ అధ్యక్షతన జరిగే తొలి సమావేశంలో ‘బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం - విప్లవ సాహిత్య సాంస్కృతిక ప్రతివ్యూహం’ అంశంపై మురళీధరన్ (అజిత్); ‘మరో యాభైల్లోకి విరసం - రూపొందుతున్న పోరాటాల ప్రపంచం’ అంశంపై పాణి ప్రసంగిస్తారు. భోజన విరామం తర్వాత పలు అంశాలపై నల్లూరి రుక్మిణి అధ్యక్షతన పెనుగొండ లక్ష్మీనారాయణ, దివికుమార్, సత్యరంజన్, బుడ్డిగ జమీందార్, రమాసుందరి, కాత్యాయనీ విద్మహే తదితరులు ప్రసంగిస్తారు. మంచికంటి, శ్రీనివాస గౌడ్, ఖాదర్ మొహియుద్దీన్, వేంపల్లి షరీఫ్, గుంటూరు లక్ష్మీనరసయ్య, నూకతోటి రవికుమార్, షేక్ కరీముల్లా, వెంకట కృష్ణ, డాని, డేవిడ్ తదితరులు కూడా వక్తలుగా పాల్గొంటారు. కార్యక్రమంలో భాగంగా ప్రజా కళామండలి, విరసం, అరుణోదయ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. పలు పుస్తకావిష్కరణలు జరుగుతాయి. ఎప్పటిలానే ఈ కార్యక్రమంలో సాహిత్య అభిమానులు భాగస్వామ్యం కావాలని విరసం కోరుతుంది.

విప్లవ రచయితల సంఘం

Updated Date - 2021-04-09T05:36:34+05:30 IST