ప్రధాని నిర్ణయంతో ప్రపంచానికి ప్రమాదం! 1200 మంది శాస్త్రవేత్తల హెచ్చరిక

ABN , First Publish Date - 2021-07-18T04:41:23+05:30 IST

బ్రిటన్‌లో కరోనా ఆంక్షలు త్వరలో ఎత్తేస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించడం శాస్త్రవేత్తలను కలవర పెడుతోంది. ఆంక్షలను ఎత్తివేయద్దంటూ ఏకంగా 1200 మంది శాస్త్రవేత్తలు తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను కోరారు.

ప్రధాని నిర్ణయంతో ప్రపంచానికి ప్రమాదం! 1200 మంది శాస్త్రవేత్తల హెచ్చరిక

లండన్: బ్రిటన్‌లో కరోనా ఆంక్షలు త్వరలో ఎత్తేస్తున్నట్టు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించడం శాస్త్రవేత్తలను కలవర పెడుతోంది. ఆంక్షలను ఎత్తివేయద్దంటూ ఏకంగా 1200 మంది శాస్త్రవేత్తలు తాజాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను కోరారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రపంచానికి ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరించారు. ఆర్థిక,రవాణా రంగాల్లో ఐరోపా అంతటికీ కేంద్రంగా ఉన్న బ్రిటన్‌లో ఆంక్షలు పూర్తిగా ఎత్తేస్తే టీకాలకు లొంగని కరోనా వేరియంట్లు ఉనికిలోకి వస్తాయని వారు హెచ్చరించారు. తద్వారా మరిన్ని కరోనా వేవ్‌లు రావచ్చని భయాందోళనలు వ్యక్తం చేశారు. ఈ మేరకు 1200 మంది శాస్త్రవేత్తలు సంతకాలు చేసిన ఓ బహిరంగ లేఖ లాన్సెట్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైంది. ఆంక్షల ఎత్తేసేందుకు ప్రధాని రూపొందించిన ప్రణాళిక కారణంగా టీకాకు లొంగలి వేరియంట్లు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని ఈ లేఖలో శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-07-18T04:41:23+05:30 IST