Advertisement
Advertisement
Abn logo
Advertisement

బాస్ ఇచ్చిన ఆఫర్‌కు భారీ షాక్.. అతడు పిచ్చోడైపోయాడా అన్నట్టు చూసిన ఉద్యోగి

ఇంటర్నెట్ డెస్క్: మంచి ప్రతిభగల ఉద్యోగిని వదులుకునేందుకు ఏ బాస్ కూడా ఇష్టపడడు. బతిమాలో, జీతభత్యాల ఆశ చూపో అతడిని తన సంస్థలోనే కొనసాగేలా చేసుకుంటాడు. కానీ.. ఓ కంపెనీకి చెందిన యజమాని మాత్రం ఎవ్వరూ ఊహించని పని చేశాడు. ఉద్యోగి తన సంస్థను వీడాలనుకుంటున్నాడని తెలుసుకున్న వెంటనే అతడికి మరో గంటలో అతడు కోరుకున్న ఉద్యోగం వచ్చేలా చేశాడు. ఉద్యోగికి ఇలా ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన ఆ విచిత్ర బాస్ పేరు జెర్రీ మాయర్. అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోగల ఫిస్కల్ కేర్ సంస్థకు ఆయన సీఈఓ. ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. నెటిజన్లు జెర్రీని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.  అసలు జెర్రీ ఇలా ఎందుకు చేశాడో తెలిస్తే మనం కూడా మెచ్చుకోకుండా ఉండలేం!

తన నిర్ణయానికి గల కారణాలేమిటో జెర్రీ స్వయంగా ఇన్‌స్టా వేదికగా తెలిపాడు. ‘‘ఆ ఉద్యోగికి మరో కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లినట్టు నాకు తెలిసింది. వెంటనే ఆ సంస్థకు ఫోన్ చేసి అతడికి ఉద్యోగం ఇవ్వమన్నా. అతడు ఎంతటి ప్రతిభల గల ఉద్యోగో.. అతడి వల్ల సంస్థకు ఎంతటి లాభం కలుగుతుందో వివరించా. నేను చెప్పిందంతా వారు విశ్వసించినట్టే ఉన్నారు. గంటలోనే అతడికి కొత్త సంస్థలో జాబ్ దొరికింది’’ అని జెర్రీ తెలిపాడు. వృత్తి పరంగా ఎదిగేందుకు అతడు కోరుతున్న అవకాశాలు తన సంస్థలో లేనందునే ఇలా చేయాల్సి వచ్చిందని జెర్రీ చెప్పాడు. ‘‘జరిగిన విషయం గురించి తెలిశాక అతడికి నోట మాట రాలేదు. నన్నో పిచ్చివాణ్ణి చూసినట్టు చూశాడు. ఎందుకిలా చేశావని అడిగాడు. నేను ఏ మహాత్ముడినో లేదా పిచ్చివాడినో కాదని రిప్లై ఇచ్చా. అతడు నా సంస్థలో ఇప్పటికే ఉన్నతస్థానానికి చేరుకున్నాడు. కెరీర్‌లో మరింత ముందుకెళ్లేందుకు అతడు కోరుకుంటున్న అవకాశాలను నేను కల్పించలేను. ఎగుదుల లేని ఉద్యోగంలో చిక్కుకుపోవడానికి మించి.. ఓ ఉద్యోగి ఉత్సాహాన్ని నిరూకార్చేది మరొకటి లేదు. చేతికున్నవి బంగారు బేడీలైనా భరించలేం’’ అని జెర్రీ తన పోస్టును ముగించాడు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement