Abn logo
Sep 20 2021 @ 23:55PM

రెండు పూరిళ్లు దగ్ధం

దగ్ధమవుతున్న ఇళ్లు

దత్తిరాజేరు: వింద్యవాసి గ్రామంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామంలోని గుండేల రవణమ్మ ఇంట్లో సోమవారం రాత్రి గ్యాస్‌ లీక్‌ అయి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పూరిల్లు కావడంతో పక్కనే ఉన్న శొంటేన రవణమ్మ ఇంటికి కూడా నిప్పు అంటుకుంది. దీంతో రెండు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు.