Sep 29 2021 @ 01:39AM

రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చల్లగా చూశాయి

‘‘ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు కరోనాపై చక్కగా పోరాడాయి. ఈ పోరాటంలో జగన్‌గారు, కేసీఆర్‌గారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ కన్నా ఏపీపైన కరోనా ఎక్కువ ప్రభావం చూపింది. తెలంగాణలో పూర్తిగా థియేటర్లు తెరిచారు. ఆంధ్రాలో అక్కడున్న పరిస్థితిని బట్టి 50 శాతం థియేటర్లను తెరిచారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మమ్మల్ని చల్లని చూపు చూశాయి. 208 రోజుల తర్వాత తెలంగాణలో కొవిడ్‌ మరణాలు లేవని చదివినప్పుడు ఆనందం కలిగింది. ఆంధ్రాలో, దేశమంతా కూడా కరోనా మరణాలు తగ్గుతున్నాయి’’ అని నాగార్జున అన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర ్శకత్వం వహించిన ‘లవ్‌స్టోరి’ చిత్రం ఇటీవలె విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో మంగళవారం చిత్రబృందం నిర్వహించిన సక్సె్‌సమీట్‌లో నాగార్జున పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ‘‘లవ్‌స్టోరి’ సినిమా సక్సెస్‌ తెలుగు పరిశ్రమకే కాదు, మొత్తం దేశ సినిమా పరిశ్రమకే ఉత్సాహాన్ని ఇస్తోంది. దసరా, సంక్రాంతికి సినిమాలు రిలీజ్‌ చేసేందుకు ధైర్యం వచ్చింది’’ అని నాగార్జున అన్నారు.  శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ‘‘మూడు ఏళ్లుగా సినిమాకు పనిచేస్తున్నాం. అన్ని ఇబ్బందులను అధిగమించి, విజయం సాధించాం’’ అని అన్నారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘‘శేఖర్‌ కమ్ముల గారు నన్ను బాగా ఎంకరేజ్‌ చేశారు. భవిష్యత్తులో ఆయనతో మంచి సినిమాలు చేస్తాను’’ అని తెలిపారు. సాయిపల్లవి మాట్లాడుతూ ‘‘మ్యూజిక్‌, ఎడిటింగ్‌... ఇలా ప్రతి విభాగంలోనూ ‘లవ్‌స్టోరి’ మ్యాజిక్‌ చేసింది. అమ్మాయిలకు ‘లవ్‌స్టోరి’ ధైర్యం ఇచ్చింది’’ అని సంతోషం వ్యక్తం చేశారు. సురే్‌షబాబు మాట్లాడుతూ ‘‘థియేటర్లలో సినిమా మ్యాజిక్‌ మళ్లీ లవ్‌స్టోరితో తిరిగొచ్చింది’’ అని ప్రశంసించారు. చిత్ర నిర్మాత నారాయణ్‌ దాస్‌ నారంగ్‌ మాట్లాడుతూ ‘‘లవ్‌స్టోరి’ సినిమాకి దక్కుతున్న ఆదరణ టాలీవుడ్‌కు శుభపరిణామం’’ అని అన్నారు. కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు దర్శకుడు సుకుమార్‌, నిర్మాత కె.ఎస్‌. రామారావు తదితరులు పాల్గొన్నారు.