Abn logo

సొరకాయ సూప్‌

కావలసిన పదార్థాలు: సొరకాయ- ఒకటి, ఉల్లి- రెండు, వెల్లుల్లి ముక్కలు- స్పూను, మిరియాల పొడి- అర స్పూను, చీజ్‌ క్రీమ్‌- మూడు స్పూన్లు, బటర్‌-  మూడు స్పూన్లు, ఉప్పు, నీళ్లు - తగినంత.


తయారుచేసే విధానం: చెక్కుతీసిన సొరకాయ ముక్కలు, ఉల్లి, వెల్లుల్ని ముక్కల్ని కూడా  ఓ పాన్‌లో వేసి ఉడికించాలి. చల్లారాక వీటిని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్‌లో బటర్‌ వేసి, కాగాక ప్యూరీ, మిరియాల పొడి, ఉప్పు వేసి అయిదు నిమిషాలు ఉడికించాలి. పొయ్యి కట్టేసే ముందు చీజ్‌ క్రీమ్‌ కలిపితే సోరకాయ సూప్‌ రెడీ. పుదీనా, తులసి ఆకుల్ని పైన అలంకరించవచ్చు.

ఉల్లిపాయ సూప్బెండకాయ సూప్‌గుమ్మడికాయ సూప్బీరకాయ సూప్‌పెస్టో పాస్తా సలాడ్‌ఓట్స్‌- క్యాప్సికమ్‌ సూప్‌క్యారెట్‌ టొమాటో సూప్‌చింతపండు చారుచిలగడదుంప సూప్‌అల్లం, వెల్లుల్లి సూప్‌
Advertisement