బౌన్సింగ్‌ బాల్‌!

ABN , First Publish Date - 2020-08-31T05:30:00+05:30 IST

బౌన్సింగ్‌ బాల్ చేయండి ఇలా...

బౌన్సింగ్‌ బాల్‌!

కావలసినవి

  1. బొరాక్స్‌ పొడి
  2. గోరువెచ్చని నీళ్లు
  3. మొక్కజొన్న పిండి 
  4. జిగురు
  5. కప్పులు
  6. ఫుడ్‌ కలర్‌


ఇలా చేయండి...

  1. ఒక కప్పులో గోరువెచ్చని నీళ్లు పోయాలి. అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ బొరాక్స్‌ పౌడర్‌ వేసి కరిగించాలి.
  2. రెండో కప్పును తీసుకొని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ జిగురు, మూడు చుక్కల ఫుడ్‌ కలర్‌ వేయాలి. ఈ మిశ్రమానికి కరిగించిన బొరాక్స్‌ పొడి, మొక్కజొన్న పిండి ఒక టేబుల్‌ స్పూన్‌ కలపాలి.
  3. కాసేపు పక్కన పెట్టుకోవాలి. పాకంలా అయ్యాక బయటకు తీసి చేతితో బంతిలా గుండ్రంగా తయారుచేయాలి. 
  4. కాస్త జిగటగా ఉండి అతుక్కుంటున్నట్టుగా ఉంటే ఎక్కువ సేపు చేత్తో అదమాలి. అంతే... బౌన్సింగ్‌ బౌల్‌ రెడీ.

Updated Date - 2020-08-31T05:30:00+05:30 IST