బౌన్సింగ్‌ బాల్‌!

ABN , First Publish Date - 2021-10-06T04:56:37+05:30 IST

ఒక కప్పులో గోరువెచ్చని నీరు తీసుకోవాలి. అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ బొరాక్స్‌ పౌడర్‌ వేయాలి. ఇది కరిగి బొరాక్స్‌ మిశ్రమం తయారవుతుంది. రెండో కప్పును తీసుకొని అందులో ఒక టేబుల్‌.....

బౌన్సింగ్‌ బాల్‌!

కావలసినవి: బొరాక్స్‌, మొక్కజొన్న పిండి, కప్పులు, ప్లాస్టిక్‌ స్పూన్‌, ఫుడ్‌ కలర్‌ , జిగురు


ఇలా చేయాలి!

ఒక కప్పులో గోరువెచ్చని నీరు తీసుకోవాలి. అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ బొరాక్స్‌ పౌడర్‌ వేయాలి. ఇది కరిగి బొరాక్స్‌ మిశ్రమం తయారవుతుంది. రెండో కప్పును తీసుకొని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ జిగురు పోయాలి. మూడు చుక్కల ఫుడ్‌ కలర్‌ వే యాలి. దీనికి బొరాక్స్‌ మిశ్రమం అర టీ స్పూన్‌, మొక్కజొన్న పిండి ఒక్కో టేబుల్‌ స్పూన్‌ చొప్పున వేయాలి. కాసేపు కలపకుండా అలాగే ఉంచాలి. తరువాత వాటిని బాగా కలిపితే పాకంలా తయారవుతుంది. ఇప్పుడు బయటకు తీసి చేతితో బంతిలా గుండ్రంగా చెయ్యాలి. ఈ బంతులు అందంగా ఉండటమే కాదు నేలకేసి కొడితే పైకి లేస్తాయి.

Updated Date - 2021-10-06T04:56:37+05:30 IST