బాక్సర్ లవ్లీనాకు కొవిడ్‌

ABN , First Publish Date - 2020-10-17T08:49:39+05:30 IST

ప్రపంచ చాంపియన్‌షి్‌ప పతక విజేత, బాక్సర్‌ లవ్లీనా బోర్గొహెయిన్‌ కరోనా బారిన పడింది. యూర్‌పలో...

బాక్సర్ లవ్లీనాకు కొవిడ్‌

న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్‌షి్‌ప పతక విజేత, బాక్సర్‌ లవ్లీనా బోర్గొహెయిన్‌ కరోనా బారిన పడింది. యూర్‌పలో 52 రోజుల పాటు శిక్షణతోపాటు, టోర్నీలలో పాల్గొనేందుకు గురువారం బయలుదేరడానికి ముందు ఆమెకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు లవ్లీనా ఇటీవల అసోంలోని స్వస్థలానికి వెళ్లింది. ఆ సందర్భంగా ఆమెకు కరోనా సోకినట్టు భావిస్తున్నారు. పాజిటివ్‌గా తేలడంతో యూరప్‌ పర్యటనకు లవ్లీనా దూరమైంది. 

Updated Date - 2020-10-17T08:49:39+05:30 IST