Abn logo
Sep 26 2021 @ 23:52PM

బాక్సింగ్‌ జిల్లా జట్టు ఎంపిక

ఎంపికైన బాక్సింగ్‌ క్రీడాకారిణులతో అసోసియేషన సభ్యులు

గుంటూరు (క్రీడలు), సెప్టెంబరు 26: స్థానిక బీఆర్‌ స్టేడియంలో బాక్సింగ్‌ అసోసియేషన ఆధ్వర్యంలో ఆదివారం బాక్సింగ్‌ జిల్లా జూనియర్‌ బాలికల విభాగంలో ఎంపికలను  నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారిణులు విశాఖ రైల్వేస్టేడియంలో జరిగే అంతర్‌జిల్లాల పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన కార్యదర్శి కె.వేణుగోపాలరావు తెలిపారు. ఎంపికైన జట్లకు కోచగా హనుమంతనాయక్‌, మేనేజర్‌గా సరళాదేవి వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఎంపికైన క్రీడకారిణుల వివరాలిలా ఉన్నాయి.. కె.భానుసాహితి (33-35 కేజీల విభాగం), ఎన.శ్రీవాణి (35-37 ), వైటీ శ్రీనిధి (37-40), పి.రుపిత (40-43), వై.సాయిషణ్ముకప్రియ (43-46), సీహెచ మేఘన (46-49), ఎం.స్వరూప (49-52), ఎం. ధీరజ (52-55), ఉజమా (55-58), అనూష (58-61), తేజశ్రీ (64-67), భానువర్ధిత (67-70 ), ఎన.ఆదిత్య (70+ కేజీల విభాగం).