రెండేసి అంగాలతో జన్మించిన శిశువు.. డాక్టర్లు షాక్

ABN , First Publish Date - 2020-11-20T16:05:39+05:30 IST

రెండు చేతులు, కాళ్లతో జన్మించిన శిశువులను చూసుంటారు.. రెండు తలలతో పుట్టిన బిడ్డల గురించి వినుంటారు... కానీ రెండు పురుషాంగాలతో...

రెండేసి అంగాలతో జన్మించిన శిశువు.. డాక్టర్లు షాక్

ఇంటర్నెట్ డెస్క్: రెండు చేతులు, కాళ్లతో జన్మించిన శిశువులను చూసుంటారు.. రెండు తలలతో పుట్టిన బిడ్డల గురించి వినుంటారు... కానీ రెండు పురుషాంగాలతో జన్మించిన శిశువు గురించి ఏనాడైనా విన్నారా..? పురుషాంగమే కాదు.. వృషణ సంచులు, మలమూత్ర విసర్జనకు సంబంధించిన అవయవాలు రెండేసి ఉన్నాయి. రెండు పురుషాంగాలకూ మూత్ర నాళికలున్నాయి. అంటే.. రెండు అంగాల నుంచి ఆ శిశువు మూత్రం పోయగలడు. అంతేకాదు.. రెండు అంగాలకు చెరొక వృషణ సంచి ఉండంతో ఆ రెండు అంగాల్లో వీర్యవృద్ధి కూడా జరుగుతుందట. దీనికి తోడు రెండు మలద్వారాలకు సంబంధించి శరీరంలో రెండు పెద్ద పేగులు కూడా ఉన్నాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ..! ఈజిప్టులోని అస్సియట్ యూనివర్శిటీ చిల్డ్రన్ ఆసుపత్రిలో ఈ శిశువు జన్మించాడు.


ఆ పిల్లాడిని తల్లి గర్భం నుంచి బయటకు తీయగానే డాక్టర్లంతా షాకైపోయారు. అయితే భవిష్యత్తులో అతనికి ఇబ్బంది కలుగవచ్చని అంటున్నారు. రెండు పురుషాంగాలు ఉండటం వల్ల దాంపత్య జీవితానికి కష్టంకావచ్చని అంటున్నారు. ఇంతకీ ఆ బాలుడు అలా పుట్టడానికి కాడల్ డూప్లికేషన్ సిండ్రోమ్ అనే రుగ్మతే కారణమట. ఈ విషయాన్ని పీడియాట్రిక్ సర్జరీ నిపుణులు అహ్మద్ మహెర్ అలీ తెలిపారు.


కడుపులో పెరిగే కవలలు.. పూర్తిగా విడిపోకపోతే ఈ సమస్య ఏర్పడుతుందన్నారు. ఇలా పుట్టిన పసివాళ్లకు రెండేసి అవయవాలు ఉంటాయని వాటిని విడదీయడం అసాధ్యమని వివరించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగానే ఉన్నాడని, అతడికి ఉన్న రెండు వృషణ సంచుల్లో ఒకదానికి 16 నెలల తర్వాత సర్జరీ చేసి పనిచేయకుండా చేస్తామన్నారు. అయితే సర్జరీ సమయంలో అత్యంత జాగ్రత్త వహించాల్సి ఉంటుందని, లేకుంటే శిశువు ప్రాణాలకే ప్రమాదమని అలీ చెప్పారు. ఏది ఏమైనా ఇలాంటి వింత శిశువులు జన్మించడం అప్పుడప్పుడూ వింటూ ఉన్నప్పటికీ.. ఈ విధంగా అన్ని అవయవాలూ రెండేసి కలిగి ఉన్న శిశువు జన్మిచడం మాత్రం ఎంతో అరుదనే చెప్పాలి.

Updated Date - 2020-11-20T16:05:39+05:30 IST