రోడ్డుకు 20 అడుగుల దూరంలో ఓ ఎర్రటి సూట్‌కేస్.. అటుగా వెళ్లిన వాళ్లకు డౌట్.. అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూస్తే..

ABN , First Publish Date - 2021-11-16T11:46:20+05:30 IST

రోడ్డుకు 20 అడుగుల దూరంలో ఓ ఎర్రటి సూట్‌కేస్.. అటుగా వెళ్లిన వాళ్లకు డౌట్.. అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూస్తే..

రోడ్డుకు 20 అడుగుల దూరంలో ఓ ఎర్రటి సూట్‌కేస్.. అటుగా వెళ్లిన వాళ్లకు డౌట్.. అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూస్తే..

ఒక వ్యక్తిని ప్రేమించే ముందు అతని గురించి కొంచెం సమాచారంగానీ, లేక అతడి స్వభావంగానీ తెలుసుకుంటే మనం చాలా జాగ్రత్త పడవచ్చు. జరగబోయే ప్రమాదాలను చాలావరకు నివారించవచ్చు. కానీ ఈ కాలం ప్రేమికులు యమ ఫాస్ట్‌గా ఉంటారు. ఎంత త్వరగా ప్రేమిస్తారో.. అంతే స్పీడుగా బ్రేకప్ అని అంటారు. కానీ ఈ బ్రేకప్‌లు కొన్నిసార్లు బెడసి కొడతాయి. 


అమెరికాలోని న్యూ యార్క్ నగరానికి సమీపంలో వెస్ట్ చెస్టర్ కౌంటీలో హైవే ఇరువైపులా అడివి ఉంది. 2019 ఫిబ్రవరి నెలలో ఆ రహదారి నుంచి వస్తూ పోతూ ఉన్నవారికి ఒక ఎరుపు రంగు సూట్‌కేసు పెద్ద సైజులో కనపడింది. దాని సమీపంలో ఎవరూ లేరు. కొందరు ఆ దారిలో ప్రయాణిస్తున్నవారు ఆ సూట్ కేసు చాలా కొత్తగా ఉండటంతో దాన్ని తెరచి చూశారు. అందులో ఉన్న దానిని చూసి ఒక్కసారిగా అందరూ షాక్‌కు గురయ్యారు. 


ఆ సూట్ కేసులో ఒక యువతి శవం ఉంది. ఆమెను ఆ సూట్‌కేసులో ఎవరో బంధించి ఆ అడివి ప్రాంతంలో పడేశారు. పోలీసులు ఆ యువతి గురించి ఆరా తీశారు. ఆమె వెస్ట్ చెస్టర్ కౌంటీలో నివసించే వెలరీ రైస్(24) అని తెలిసింది. ఆమె జనవరి 30 నుంచి కనబడటం లేదని మిస్సింగ్ కేసు కూడా ఉంది. వెలరీ తల్లి ఆమె గురించి కొన్ని విషయాలు పోలీసులకు చెప్పింది.


జనవరి 2018లో వెలరీ సోషల్ మీడియో ద్వారా ఒక వ్యక్తిని కలిసింది. తనతో డేటింగ్ కూడా చేసింది. అతని పేరు జావియర్. జావియర్‌తో వెలరీ మూడు నెలలపాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. ఆ తరువాత వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. జావియర్‌తో వెలరీ తెగతెంపులు చేసకుంది. అతనితో గొడవపడి ఇక నుంచి తనతో మాట్లాడొద్దు, కలవొద్దు అని స్పష్టంగా చెప్పేసింది. జావియర్ ఏదో పని మీద వేరే ఊరికి వెళ్లిపోయాడు.


కొన్ని నెలల తరువాత అంటే 2019 జనవరి 30 నుంచి వెలరీ పని చేసే బుక్ స్టోర్‌లో ఆమె విధులకు హాజరు కాలేదు. ఆమె తల్లి కూడా తన కూతురు ఏమైపోయిందోనని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మూడు రోజుల తరువాత ఊరి బయట హైవే వద్ద ఒక సూట్ కేసులో వెలరీ శవం దొరికింది. పోస్టుమార్టం రిపోర్టులో ఆమె చేతి వేలి గోర్లలో మరో వ్యక్తి చర్మం కాస్త ఇరుక్కొని ఉన్నట్లు తేలింది. 


పోలీసులు అనుమానంతో జావియర్‌ని అరెస్టు చేశారు. అతని డిఎన్‌ఏ శాంపిల్స్‌ని వెలరీ గోర్లలో దొరికిన చర్మ డీఎన్‌ఏతో పోల్చి చూడగా అవి అతనివే అని తేలింది. దీంతో జావియర్ వెలరీని హత్య చేసినట్టు పోలీసులకు అర్థమైంది. జావియర్‌ హత్య చేసినట్టు ఒప్పుకోవడంతో  కోర్టు అతనికి 30 ఏళ్లు జైలు శిక్ష విధించింది.


Updated Date - 2021-11-16T11:46:20+05:30 IST