Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుపతిలో బాలుడు కిడ్నాప్

తిరుపతి: అలిపిరి బాలాజీ లింకు బస్టాండు వద్ద బాలుడు కిడ్నాప్‌నకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడి అపహరణ పట్టణంలో కలకలం సృష్టస్తోంది. ఈ సంఘటన గత నెల 27న జరుగగా ఆలస్యంగా వెలుగు చూసింది. చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుపతికి వచ్చింది. అయితే వారు కొంతసేపు అలిపిరి బస్టాండు వద్ద ఉన్నారు. ఈ సమయంలో బాలుడు కనిపంచకుండా పోయాడు. తమ కొడుకు కనిపించకపోవడంతో వారు అక్కడంతా వెతికారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. బస్టాండు వద్ద వీరు ఉన్నప్పుడు వీరి పక్కన మరో వ్యక్తి పేపర్ చదువుతున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. పేపర్ చదువుతున్న వ్యక్తే బాలుడిని తీసుకుని వెళుతున్నట్లు సీసీ కెమెరాలో కనిపించింది. గత నెల 27న బాలాజీ లింకు బస్టాండు నుంచి బాలుడిని గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు సీసీ రికార్టులో నమోదయింది. బాలుడి ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలతో అలిపిరి పోలీసులు గాలింపు చేపట్టారు. 

Advertisement
Advertisement