Abn logo
Mar 30 2021 @ 18:14PM

నాలుకతో అద్భుతమైన కళాఖండాలు

విశాఖ: సాధారణంగా కుంచెను చేత్తో పట్టుకుని అద్భుత చిత్రాలను గీస్తారు చిత్ర కళాకారులు. కొందరు నేరుగా చేత్తోనే వేస్తారు. కానీ ఓ చిత్రకారుడు మాత్రం నాలుకనే కుంచెగా మలుచుకుని అద్భుతమైన కళాఖండాలను సృష్టిస్తున్నారు. నర్సీపట్నంలోని బలిఘట్టంకు చెందిన కళాకారుడు వినోద్ తనలోని కళా నైపుణ్యాన్ని నాలుకతో పదును పెడుతున్నారు. ఐదో తరగతి నుంచే చిత్ర లేఖనంపై ఆసక్తి పెంచుకున్న వినోద్ పలు పోటీల్లో పాల్గొని ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన అఖిల్ వర్మ స్పూర్తితో నాలుకతో చిత్రాలు గీయడం ప్రారంభించారు. 


కరోనా సెలవుల్లో తనలోని నైపుణ్యాన్ని మరింత పదును పెట్టారు. ఒకేసారి చేతులు, కాళ్లు, నాలుకను ఉపయోగించి బొమ్మలు గీయడంలో ఆరితేలాడు వినోద్. కపిలపట్నం ఆర్ట్స్ అకాడమీని నిర్వహించిన చిత్ర లేఖనం పోటీల్లో వినోద్‌కు అవార్డు దక్కింది. కాసుల చిత్ర కళా అకాడమీ నిర్వహించిన అఖిల భారత స్థాయి ప్రతిభా పోటీల్లోనూ వినోద్  అవార్డును సొంతం చేసుకున్నారు. చదువును కొనసాగిస్తూనే అద్భుతమైన చిత్రాలను గీసి దేశానికి మంచి పేరు తేవడమే తన లక్ష్యమని చిత్రకారుడు వినోద్ చెబుతున్నారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement