3 ఏళ్ల తరువాత ఆధార్ కలిపింది

ABN , First Publish Date - 2021-08-10T11:10:32+05:30 IST

అతడికి వినపడదు. మాట్లాడలేడు. దివ్యాంగుడైన ఆ బాలుడు 15ఏళ్ల వయసులో కుటుంబం నుంచి తప్పిపోయాడు. అయితే ..

3 ఏళ్ల తరువాత ఆధార్ కలిపింది

లక్నో: అతడికి వినపడదు. మాట్లాడలేడు. దివ్యాంగుడైన ఆ బాలుడు 15ఏళ్ల వయసులో కుటుంబం నుంచి తప్పిపోయాడు. అయితే 3 ఏళ్ల తరువాత తిరిగి తన కుటుంబంతో కలిశాడు. ఆధార్ కార్డ్ కారణంగా అతడు ఇన్నేళ్ల తరువాత కుటుంబంతో కలిశాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని జవున్‌పూర్ జిల్లా, ఈటోరీ గ్రామంలో శివం చౌహాన్ అనే దివ్యాంగ బాలుడు నివశించేవాడు. అయితే 3 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. అక్కడి నుంచి నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ చేరుకున్నాడు. అయితే తనకున్న శారీరక సమస్యల కారనంగా తాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు.. అనే విషయాలను అక్కడి వారికి చెప్పలేకపోయాడు. 


రైల్వే పోలీసులు అతడిని గవర్నమెంట్ చిల్డ్రన్ హోంకు అప్పగించారు. అప్పటినుంచి అక్కడే ఉంటున్నాడు. ఆ చిల్డ్రన్ హోం సూపరింటెండెంట్ వినోద్ దాబెరావ్.. శివం పేరిటి ఆధార్ నమోదు చేయాలని భావించారు. అయితే ఎన్ని ప్రయత్నించినా.. ఫెయిల్ అని రావడంతో.. అతడి వివరాలను బెంగళూరులోని ఆధార్ డేటా సెంటర్‌కు పంపించడం జరిగింది. దీంతో అతడి కుటుంబం, సొంత గ్రామానికి సంబంధించిన వివరాలు బయటపడ్డాయి. నాగ్‌పూర్ పోలీసులు శివం కుటుంబానికి వివరాలు చెప్పి.. అతడిని తిరిగి కుటుంబానికి అప్పిగించారు.


కాగా.. ఇటీవల ఇలాంటి మరో కేసు వెలుగులోకొచ్చిన విషయం తెలిసిందే. మహ్మద్ ఆమిర్ అనే చిన్నారి ఆధార్ వివరాల ఆధారంగానే 7ఏళ్ల తరువాత కుటుంబంతో చేరాడు. సరిగ్గా అతడి కథలానే శివం కథ కూడా సుఖాంతం కావడంతో అంతా ఆనందపడుతున్నారు. ఆధార్ వల్లనే ఇది సాధ్యమైందని నాగ్‌పూర్ ఏఎస్‌కే సెంటర్ మేనేజర్ అనిల్ మరాఠే పేర్కొన్నారు.

Updated Date - 2021-08-10T11:10:32+05:30 IST