Advertisement
Advertisement
Abn logo
Advertisement

గర్ల్‌ఫ్రెండ్ కోసం సానిటరీ ప్యాడ్ దొంగగా మారిన యువకుడు.. ఇంకా ఆమె ప్రేమకోసం ఏం చేసేవాడంటే..

ప్రేమ, గెలుపు కోసం ఏం చేసినా తప్పుకాదని ఇంగ్లీషులో(All is fair in love and war) ఒక మాట ఉంది. కానీ నిజజీవతంలో ఇది చాలా సార్లు ఘోరాలకు దాారితీస్తుంది. ఇలాంటి ఒక కేసులో ప్రేమకోసం ఒక ప్రియుడు దొంగగా మారాడు. అతని ప్రియరాలిని సంతోషపెట్టడానికే దొంగతనాలు చేసేవాడు. 


మధ్యప్రదేశ్‌లోని బైతూల్ నగరానికి చెందిన అమన్ అనే యువకుడు నర్సింగ్ చదువుకుంటున్నాడు. అతనికి ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉంది. ఆమెను సినిమాలకు షాపింగ్‌లకు తీసుకెళ్లేవాడు. ఆ ఖర్చులు భరించడానికి ఒక మెడికల్ షాపులో పార్ట్ టైం పనిచేసేవాడు. ఆ మెడికల్ షాపు ఓనర్ ఒక ముస్లిం కావడంతో నమాజు సమయంలో అమన్‌ మీద నమ్మకంతో షాపుని వదిలివెళ్లేవాడు. అలా అమన్ అంటే ఆ షాపు ఓనర్‌కి మంచి అభిప్రాయం ఉంది. 


కొన్ని రోజుల తరువాత మెడికల్ షాపు ఓనర్‌కి లెక్కలో పెద్ద తేడా వచ్చింది. అతను చెల్లించాల్సిన బిల్లులు ఎక్కువగా ఉండడం.. షాపు సరుకు తక్కువగా ఉండడంతో అనుమానం వచ్చింది. వెంటనే సీసీటీవి వీడియోలను తీసి చూసాడు. అందులో అతనికి షాకింగ్ నిజాలు తెలిశాయి. అతను నమాజు కోసం బయటికి వెళ్లినప్పుడు.. అమన్ క్యాష్ దొంగలించేవాడు. క్యాష్ లేని సమయంలో సరుకులు అమ్మి డబ్బులు జేబులో వేసుకునేవాడు. ఇంకా మరికొన్ని వీడియోలలో అమన్ షాపు సరుకులు సైతం దొంగిలించడం కనబడింది. 


ఇదంతా చూసిన ఆ షాపు ఓనర్.. పోలీసులకు అమన్‌పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అమన్‌ని అరెస్టు చేసి విచారణ చేశారు. అప్పుడు అమన్ తన కష్టాల గురించి పోలీసులకు వివరించాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌కు షాపింగ్ పిచ్చి అని.. అందుకోసం తనకు డబ్బులు అవసరమని చెప్పాడు. పోలీసుల విచారణలో భాగంగా సీసీటీవి వీడియోలలో అమన్ స్తీలు ఉపయోగించే సానిటరీ ప్యాడ్స్ సైతం దొంగిలించేవాడని తేలింది. ప్రస్తుతం పోలీసులు అమన్‌పై దొంగతనం కేసు నమోదు చేశారు.


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement