Abn logo
Sep 25 2021 @ 00:53AM

జడ్పీ చైర్‌పర్సనగా బోయ గిరిజమ్మ

మాట్లాడుతున్న మంత్రి శంకరనారాయణ, చిత్రంలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు

వైస్‌చైౖర్మన్లుగా కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, నాగరత్నమ్మ 

మంత్రి శంకరనారాయణ వెల్లడి

అనంతపురం కార్పొరేషన,సెప్టెంబరు 24: జిల్లా పరిషత్తు చైర్‌పర్సనగా  ఆత్మకూరు జడ్పీటీసీ సభ్యురాలు బోయ గిరిజమ్మను ఎంపిక చేసినట్లు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ వెల్లడించారు. శుక్రవారం అనంతపురం నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా పరిషత్తు వైస్‌చైర్మన్లుగా ధర్మవరం జడ్పీటీసీ సభ్యుడు కామిరెడ్డిపల్లి సుధాకర్‌రెడ్డి, నార్పల జడ్పీటీసీ సభ్యురాలు నాగరత్నమ్మలను ఎంపిక చేశామన్నారు. వారి పేర్లను  పార్టీ అధిష్టానం  ఖరారు చేసిందన్నారు. శనివారం వారు ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. జిల్లా పరిషత్తు కో-ఆప్షన సభ్యులుగా కదిరి నియోజకవర్గానికి చెందిన ఫయాజ్‌ అలి, పెనుకొండ నియోజకవర్గం గోరంట్లకు చెందిన అబూ బాషాలను నియమించామన్నారు. అనంతరం జడ్పీ నూతన చైర్‌పర్సనకు మంత్రి శంకరనారాయణ, ఎంపీలు, ఎమ్మెల్సీ విప్‌, ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎంపీపీలు, వైస్‌ ఎంపీపీలకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్‌ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన లిఖిత, ఆలూరు సాంబశివారెడ్డి, గిరిజమ్మ, వీరాంజనేయులు పాల్గొన్నారు. 


జడ్పీటీసీల ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం 

- నేడు జడ్పీ చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక

అనంతపురం విద్య, సెప్టెంబరు 24 : జడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యులు, జడ్పీ చైర్మన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నికకు జడ్పీ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈనెల 19న  పరిషత్‌ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్వహించారు. జిల్లాలో చిలమత్తూరు జడ్పీటీసీ స్థానం మినహా మిగిలిన 62 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో  వైసీపీ 60 జడ్పీటీసీలను కైవసం చేసుకుంది. అగళిలో టీడీపీ అభ్యర్థి, రొళ్లలో స్వతంత్ర అభ్యర్థి గెలు పొందారు. శుక్రవారం వీరంతా సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం చేసే జడ్పీ సమావేశ మందిరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వేదికను ముస్తాబు చేయడంతోపాటు, అధికార వైసీపీకి చెందిన జడ్పీటీసీలకు ఒకవైపు, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థు లకు మరో వైపు ఏర్పాట్లుచేశారు. ఏర్పాట్లను జేసీ సిరి సాయంత్రం పరిశీలించారు. రాత్రి ఎన్నికల పరిశీలకుడు హర్షవర్ధన్‌పరిశీలించారు.