సంపూర్ణ గృహ హక్కును బహిష్కరించండి: టీడీపీ

ABN , First Publish Date - 2021-12-01T05:41:04+05:30 IST

జగనన్న సంపూర్ణ గృహ హక్కును బహిష్కరించాలని రాజంపేట పార్ల మెంటరీ టీడీపీ మీడియా ప్రతినిధి రాజన్న పిలుపు నిచ్చారు.

సంపూర్ణ గృహ హక్కును బహిష్కరించండి: టీడీపీ
ప్రసంగిస్తున్న రాజన్న తదితరులు

నిమ్మనపల్లె నవంబరు 30: జగనన్న సంపూర్ణ గృహ హక్కును బహిష్కరించాలని రాజంపేట పార్ల మెంటరీ టీడీపీ మీడియా ప్రతినిధి రాజన్న పిలుపు నిచ్చారు. మంగళవారం కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు  ఇవ్వలేని పరిస్థితులో ఉందని, అప్పు పుట్టక ఉద్యోగుల పీఎఫ్‌, పేద మహిళల ఎల్‌ఐసీ నిధులను వాడుకుందన్నారు. ఇది కాకుండా ఓటీఎస్‌ పేరుతో పేదలనుంచి డబ్బులు రాబట్టేందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వం నుంచి 2012 వరకు రూ.30వేలతో నిర్మించుకొన్న ఇళ్లను వారి పేరుతోనే రిజిస్ర్టేషన్‌ చేస్తామంటూ అందుకు రూ.10వేలు చెల్లించాలని మభ్యపెడుతోందన్నారు. గతంలో ఎన్నడూ లేని వి ధంగా వర్షాలు పడి పంటలను పూర్తిగా కోల్పోయిన రైతులను ఆదుకోవాల్సింది పోయి రూ.10వేలు చెల్లిం చాలంటూ  లబ్ధిదారులపై వలంటీర్లు ఒత్తిడి తెస్తు న్నారని వాపోయారు. సచివాలయ సిబ్బందికి, వలం టీర్లకు లక్ష్యాలు ఇచ్చారని, చేరుకోలేకపోతే ఉద్యోగాల నుంచి తొలగించే పక్రియ చేపడుతున్నట్లు తెలుస్తోం దన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇల్లు కట్టించలేదని, గత ప్రభుత్వాలు మంజూరు చేసిన ఇళ్లకు రిజి స్ర్టేషన్‌ పేరుతో డబ్బు వసూలుకు దిగడం సరికా దన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉచి తంగా రిజిస్రేష్టన్‌ చేసి ఇస్తామన్నారు. సర్పంచ్‌ రెడ్డెప్ప, శ్రీపతి, రెడ్డెప్ప, రామకృష్ణ, రమణ, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T05:41:04+05:30 IST