Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకుంటే బ్రేకప్ చెప్పేస్తా... యువతికి బెదిరింపులు!

లండన్: కరోనా వైరస్ నుంచి రక్షణకు వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం. అందుకే అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేశాయి. అయితే బ్రిటన్‌కు చెందిన ఒక యువకుడు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే బ్రెకప్ చెప్పేస్తానని తన గర్ల్‌ఫ్రెండ్‌ను బెదిరించాడు. ఈ ఉదంతానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

‘మిర్రర్ యూకే’ అందించిన సమాచారం ప్రకారం ఒక యువతి తన బాయ్ ఫ్రెండ్‌తో తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ యువతి, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఏడాదిగా రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. ఆ యువతి ఇటీవలే కరోనా వ్యాక్సీన్ తొలిడోసు వేయించుకుంది. అయితే ఇప్పుడు రెండవ డోసు వ్యాక్సీన్ వేయించుకుంటే బ్రేకప్ చెప్పేస్తానని ఆ యువకుడు ఆమెను బెదిరిస్తున్నాడు. మొదట్లో అతను ఆ మాటను ఆటపట్టించేందుకే అన్నాడని అనుకుంది. అయితే ఆ తరువాత ఆ మాటను సీరియస్‌గా చెప్పాడని గ్రహించింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె తన బాధను సోషల్ మీడియాలో వెళ్లగక్కి, తాను ఏమి చేయాలో చెప్పాలని అందరినీ కోరుతోంది. దీనికి సమాధానంగా కొందరు... బాయ్ ప్రెండ్ కన్నా వ్యాక్సిన్ ముఖ్యమని చెబుతుండగా, మరికొందరు అతను జీవితాలతో ఆటలాడుకునే మనిషని అంటున్నారు. మరొక యూజర్ వ్యాక్సిన్ ప్రాముఖ్యతను అతనికి చెప్పి, అవగాహన కలిగించాలని సూచించాడు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement