Abn logo
Apr 12 2021 @ 20:51PM

ఉద్యోగం పోవడంతో సెక్స్ వర్కర్‌ అవతారం.. విడాకులకు భార్య దరఖాస్తు

బెంగళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన విలయతాండవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. భారత్‌లో కూడా ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంది. వేలాదిమంది ఉద్యోగాలు కోల్పోయి బతుకు తెరువు కోల్పోయారు. అలాంటి వారిలో బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల బీపీవో ఉద్యోగి ఒకరు.


లాక్‌డౌన్ కారణంగా ఉద్యోగం ఊడిపోవడంతో ఏం చేయాలో పాలుపోని ఆయన కుటుంబాన్ని వెళ్లదీసేందుకు కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా మారాడు. అయితే, ఈ విషయాన్ని ఆయన తన 24 ఏళ్ల భార్య దగ్గర దాచిపెట్టాడు. అంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడా విషయం తెలిసిన భార్య విడాకులకు దరఖాస్తు చేయడంతో విషయం వెలుగు చూసింది.

బీపీవోలో పనిచేస్తున్న వీరిద్దరూ 2017లో తొలిసారి ఆఫీసు క్యాంటీన్‌లో కలుసుకున్నారు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా.. అలాంటిదే వీరికీ కలిగింది. ఆ తర్వాత సినిమాలు, షికార్లు ఇక చెప్పేదేముంది రెండేళ్లపాటు ప్రపంచాన్ని మర్చిపోయి తిరిగారు. 2019లో పెళ్లి చేసుకుని సుబ్రహ్మణ్యనగర్‌లోని ఓ ఇంట్లో అద్దెకు దిగారు. సంసారం సంతోషంగా సాగిపోతోందనుకుంటున్న సమయంలో కరోనా మహమ్మారి వచ్చిపడింది. లాక్‌డౌన్ కారణంగా కంపెనీ అతడికి లే ఆఫ్ ఇచ్చింది.


దీంతో మళ్లీ ఉద్యోగం కోసం అన్వేషణ ప్రారంభించాడు. లాక్‌డౌన్ వల్ల పరిస్థితులు తలకిందులు అవడంతో అతడి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించలేదు. ఇలాగైతే లాభం లేదని చివరికి ‘మేల్ ఎస్కార్ట్’ వృత్తిని ఎంచుకున్నాడు. ఈ విషయాన్ని అతడు తన భార్య వద్ద దాచిపెట్టాడు. అయితే, తప్పును ఎన్నాళ్లో దాచిపెట్టి ఉంచలేం కదా.. ఇక్కడే అదే అయింది.


భర్త ప్రవర్తనలో మార్పును భార్య గుర్తించింది. ల్యాప్‌టాప్ లేదంటే మొబైల్ ముందేసుకుని ఎప్పుడూ బిజీగా ఉండడం, తనతో మాట్లాడే సమయమే లేదన్నట్టు గడిపేస్తుండడంతో భర్తను అనుమానించక తప్పలేదు. ఎక్కడికెళ్లొస్తున్నావని ప్రశ్నిస్తే ఏవోవో కొత్త కొత్త ప్రదేశాల పేర్లు చెబుతుండడం, అంతకుమించిన వివరాలు వెల్లడించకపోవడంతో ఆమెలో అనుమానం మరింత పెరిగింది. 


భర్త ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలని నిర్ణయించుకున్న భార్య.. సోదరుడి సహాయంతో భర్త ల్యాప్‌టాప్ పాస్‌వర్డ్‌ను ఛేదించింది. ల్యాప్‌టాప్‌లోని ఓ ఫోల్డర్‌ను ఓపెన్ చేసిన ఆమె అందులోని ఫొటోలు చూసి దిగ్భ్రాంతికి గురైంది. అవన్నీ మహిళలతో సన్నిహితంగా ఉన్న ఫొటోలే. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుంది. తన భర్త ‘మేల్ ఎస్కార్ట్’గా పనిచేస్తున్నాడని. నగరంలోని క్లయింట్స్ నుంచి గంటకు రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నాడని. 


భర్త చేస్తున్న ‘ఉద్యోగం’ గురించి తెలుసుకున్న భార్య వెంటనే వనితా సహాయవాణి (మహిళల హెల్ప్‌లైన్)ను ఆశ్రయించింది. తనకు విడాకులు ఇప్పించాలని వేడుకుంది. వారు మహిళ భర్తను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు.


ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తాను కమర్షియల్ సెక్స్ వర్కర్‌గా పనిచేస్తున్న మాట వాస్తవమే కానీ, భార్యపై మాత్రం చెప్పలేనంత ప్రేమ ఉందని చెప్పుకొచ్చాడు. భార్య నుంచి విడిపోవడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నాడు. అంతేకాదు, ఈ ఉద్యోగాన్ని వదిలేసి కొత్త ఉద్యోగం వెతుక్కుంటానని కూడా భార్యకు ప్రమాణం చేశాడు. అయినా అందుకామె అంగీకరించలేదు. దీంతో పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామంటూ సిటీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement