Advertisement
Advertisement
Abn logo
Advertisement

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్‌

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి అంటూ పలువురు వక్తలు కొనియాడారు. అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా రాజకీయ నేతలు, యువజన సంఘాలు, దళిత సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నివాళులర్పించారు. అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. పలుచోట్ల రక్తదానం, నోట్‌ పుస్తకాల పంపిణీ తదితర సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు.


బుట్టాయగూడెం, డిసెంబరు 6: భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బల హీన వర్గాల ఆశాజ్యోతి డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో ఘనంగా నివాళులర్పించారు. కేఆర్‌.పురంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంపీపీ కారం శాంతి, వైస్‌ ఎంపీపీ కుక్కల వర లక్ష్మి అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. రాజీవ్‌నగర్‌ కాలనీలో యువజన సంఘం ఆధ్వర్యంలో నివాళులర్పించారు. బాషా శ్యాంబాబు, కో రం దుర్గారావు, దారా శిఖామణి తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ కార్యా లయంలో తహసీల్దార్‌ వైవి లక్ష్మీకుమారి, అంబేడ్కర్‌పేటలో కేవీపీఎస్‌ నాయకుడు అందుగుల ప్రాన్సిస్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు.

దేవరపల్లిలో ఎమ్మెల్యే వెంకట్రావు నివాళి

దేవరపల్లి: చిన్నాయిగూడెం, దుద్దుకూరు, గౌరీపట్నం, యర్నగూడెం, దేవరపల్లి గ్రామాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీపీ కేవీకే దుర్గారావు, ఏఎంసీ చైర్మన్‌ గన్నమని జనార్థనరావు, జడ్పీటీసీ స్వర్ణలత, సర్పంచ్‌ కడిమి వీరకు మారి, కె.సతీష్‌, కవల శ్రీనివాస్‌, గడా జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు. డిగ్రీ కళాశాలలో ఏసీఎస్‌ఎస్‌ బీసీ మేనేజర్‌ కృష్ణారెడ్డి, కళాశాల చైర్మన్‌ సు వర్ణరాజు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

చింతలపూడిలో యువత నివాళి

చింతలపూడి: చింతలపూడిలో పలు సంస్థల ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్ధంతి ఘనంగా జరిగింది. బోయగూడెం అంబేద్కర్‌ యూత్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి ఎంపీపీ డి.రాంబాబు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పాతబస్టాండ్‌ వద్ద శివకుమార్‌, తూము నరేష్‌, కొట్టే రవి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేశారు.

స్థానిక గురుకుల పాఠశాలలో 40 మంది పేద విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎయిమ్‌ జిల్లా కార్యదర్శి కాకర్ల సత్యనారాయణ, బుచ్చిబాబు, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

జీలుగుమిల్లి ఉన్నత పాఠశాలలో నివాళి

జీలుగుమిల్లి: జడ్పీ ఉన్నత పాఠశాల్లో అంబేడ్కర్‌కు ఘనంగా నివాళు లర్పించారు. ఉపాధ్యాయులు కందుల ప్రకాష్‌, ఉపసర్పంచ్‌ బొంతు రవితేజ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాలలు వేశారు. జగదాంబ సెంటరులో ఆటో యూనియన్‌ సభ్యులు, వంకవారిగూడెం వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చారు. పి.సా యి, కె.రాజేష్‌, కె.సుబ్బు, ఎ.నవకిశోర్‌, వి.ప్రసాద్‌, టి.సతీష్‌ ఉన్నారు.

Advertisement
Advertisement